Flowers Waste : పూల వ్యర్ధాలతో విలువ అధారిత వస్తువుల తయారీ

ఇప్పజాతి పూలను ఇటీవలి కాలంలో వెనిగర్, ఆల్కహాల్ తయారీలో వినియోగిస్తున్నారు. పూల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. అలా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను కరెంటు తయారీలో వాడతారు.

Flowers Waste : పూల వ్యర్ధాలతో విలువ అధారిత వస్తువుల తయారీ

Floral Waste

Updated On : March 22, 2022 / 2:57 PM IST

Flowers Waste : సాంప్రదాయాలకు, సంస్కృతులకు భారత దేశం పెట్టింది పేరు. సంతోషకరమైన సందర్భమైనా, దేవుడి అలంకరణైనా పూలతోనే ముడిపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాడిన పూల వ్యర్ధాలను పారేయటం అన్నది ప్రధాన సమస్యగా మారింది. అయితే ఇటీవలి కాలంలో వినియోగించిన పూలతోపాటు, పూలను ఉపయోగించి వివిధ రకాల విలువ అధారిత ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల వాతావరణానికి ఎలాంటి హాని కలగకుండా పూల వ్యర్ధాలను సద్వినియోగం అవుతున్నాయి.

పూల వ్యర్ధాలను కుళ్ళబెట్టి వర్మికంపోస్టును తయారు చేయవచ్చు. ఈ కంపోస్టును దేవాలయం ప్రాంగణంలో మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఎరువును అమ్మడం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. పూల వ్యర్ధాల నుండి తయారైన ఎరువులో కార్బన్, నత్రజని, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి. మొక్కలకు మంచి సేంద్రీయ ఎరువుగా పనిచేస్తుంది.

ఇప్పజాతి పూలను ఇటీవలి కాలంలో వెనిగర్, ఆల్కహాల్ తయారీలో వినియోగిస్తున్నారు. పూల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. అలా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను కరెంటు తయారీలో వాడతారు. పూల రెక్కల నుండి నూనెను, రంగులను తీసిన తరువాత మిగిలిన వ్యార్ధాలతో అగరుబత్తులను తయారు చేసే పరిశ్రమలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

పూలతో ఎలాంటి రసాయనాలు లేని కాగితాన్ని తయారు చేయవచ్చు. రంగుల తయారీలో, బ్యాటరీలో పూలను వినియోగిస్తున్నారు. నీటిలో కలవని బరువైన ధాతువులను తొలగించి శుభ్రపరచటానికి పూల వ్యర్ధాలు ఉపయోగపడతాయి. కొన్ని రకాల పూలను ఔషదాల తయారీలోను వినియగిస్తున్నారు. ఇప్పపువ్వును బ్రాంకైటిస్ ఔషదతయారీలో, లిల్లీ పూలను కామెర్లు, ఉదర సంబంధ వ్యాధులను తగ్గించటంలో, గులాబీలను సైతం మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు.