Green Gram Cultivation : ఖరీఫ్ పెసర సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

Green Gram Cultivation : చాలా ప్రాంతాల్లో వర్షభావ పరిస్థితులు, చీడపీడల బెడద పెసర పంటను దెబ్బతీస్తున్నాయి . వీటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Green Gram Cultivation : ఖరీఫ్ పెసర సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం

Green Gram Cultivation Methods

Updated On : July 14, 2024 / 4:21 PM IST

Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా విత్తిన పెసర పైరు ప్రస్థుతం 10 నుండి 20 రోజుల దశలో ఉంది. రబీ పంటల వేయబోయే రైతాంగం, 60 నుండి 75 రోజుల్లో చేతికొచ్చే పెసరను తొలకరిలో సాగుచేయటం ఆనవాయితీగా వస్తోంది. పెసర సాగు వల్ల తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం చేతికందటంతోపాటు , భూసారం పెరగుతోంది.

Read Also : Sunflower Cultivation : ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు రకాలు.. సాగు మెళకువలు

అయితే చాలా ప్రాంతాల్లో వర్షభావ పరిస్థితులు, చీడపీడల బెడద పెసర పంటను దెబ్బతీస్తున్నాయి . వీటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను సాగుచేస్తున్నారు.

ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగం తొలకరిలో పెసరను సాగుచేస్తున్నారు.. ప్రస్థుతం పైరు 10 నుండి 20 రోజుల దశ వరకు వుంది. చాలా బెట్ట పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల లోపించగా, కొన్ని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువై పంట పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోంది..

ఈ సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ప్రధానశాస్త్రవేత్త జె.హేమంత్ కూమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. పెసర పైరు తొలిదశలో చిత్త పురుగులు, పల్లాకు తెగులు సమస్య అధికంగా కనిపిస్తోంది . పల్లాకు వైరస్ కు నివారణ లేదు. కనుక తెల్లదోమను అరికట్టేందుకు రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

Read Also : Weed Management : వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం