Weed Management : వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం

Weed Management : రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు కురుస్తున్న వానలతో కలుపు మొక్కలు అధికమై.. పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి.

Weed Management : వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం

Weed management in different crops

Updated On : July 14, 2024 / 4:10 PM IST

Weed Management : ఖరీఫ్ లో ప్రధానంగా వరి, పత్తి, కంది, మొక్కజొన్న వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు రైతులు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు పంటలకు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది. కలుపు మొక్కలు పంటలో నీరు, పోషకాలు, సూర్యరశ్మికి పోటీపడుతూ పంట దిగుబడిని తగ్గిస్తాయి. పంట నాణ్యతను తగ్గిస్తాయి. కావున వానాకాలం సాగుచేసే వివిధ పంటల్లోని కలుపు మొక్కల నివారణ పద్ధతులను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శ్రీధర్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

రైతులను కలుపు మొక్కల సమస్య వేధిస్తుంది. ఒక వైపు కూలీల కొరత, మరో వైపు కురుస్తున్న వానలతో కలుపు మొక్కలు అధికమై.. పంట ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి. అలాగే భూమిలోని పోషకాలు పంట మొక్కలకు అందకుండా కలుపు మొక్కలే లాగేసుకుంటాయి. దీంతో కలుపు నివారణ మందులపై రైతులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.

సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములన సరిగ్గా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వివిధ పంటల్లో  ఆశించే కలుపు మొక్కలు వాటి నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శ్రీధర్.

Read Also : Sunflower Cultivation : ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు రకాలు.. సాగు మెళకువలు