PMDS System : నవ ధాన్యాల సాగు.. పీఎండీఎస్ విధానంతో అధిక దిగుబడులు..

PMDS System : ఈ కోవలోనే ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం, కరవది గ్రామానికి చెందిన ఓరైతు రెండున్నర ఎకరాల్లో పిఎండిఎస్ విధానంలో 32 రకాల పంటలను సాగుచేస్తున్నారు.

PMDS System : నవ ధాన్యాల సాగు.. పీఎండీఎస్ విధానంతో అధిక దిగుబడులు..

High yields with PMDS system

PMDS System : ఒకే పంటపై ఆధారపడిన రైతులకు వ్యవసాయంలో నష్టలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆర్ధిక నష్టాలు సంభవించే వీలుంది. అయితే అంతర పంటల సాగులో ఆ విధమైన పరిస్థితి వుండదు. అయితే నీటి సౌకర్యం ఉండాలి. కానీ ప్రకాశం జిల్లాలో ఓ రైతు నీటి ఎద్దడిని తట్టుకుని, పంట దిగుబడులను పొందేందుకు పి.ఎం.డి.ఎస్ విధానంలో పలు రకాల ధాన్యాలను సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు రైతులు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకొని నిలిచి అధిక దిగుబడులిస్తాయి. ముఖ్యంగా.. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం.. అంటే ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోవింగ్‌ విధానం.. దీన్ని పాటించినట్లయితే.. భూమిలో సారం పెరగడమే కాకుండా… ఆయా పంటల నుండి కొంత మేర దిగుబడులను పొందవచ్చు..

అంతే కాదు.. పశుగ్రాసంగా ఉపయోగపడటమే కాకుండా.. ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకొని ప్రధాన పంటల్లో అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ పీఎండిఎస్ విధానం ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది రైతులు రెండు మూడు ఏళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ.. మంచి ఫలితాలను పొందతున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం, కరవది గ్రామానికి చెందిన ఓరైతు రెండున్నర ఎకరాల్లో పిఎండిఎస్ విధానంలో 32 రకాల పంటలను సాగుచేస్తున్నారు.

విషతుల్యమవుతున్న ఆహారం.. ఇంకోవైపు దెబ్బ తింటున్న భూసారం.. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమేనని గుర్తించిన ఔత్సాహిక రైతులు.. ఈ విదానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. వర్మి కంపోస్టు, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది.

వాటికి బదులు నవధాన్యాల సాగుతో సహజసిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకూ వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, ఉలవలు, మినుములు పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుంగంధ ద్రవ్యాలు , దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సూచనలతో ఔత్సాహిక రైతులు సాగు చేపడుతున్నారు.

Read Also : Best Mango Plants : రైతులకు అందుబాటులో మేలైన మామిడి మొక్కలు