Finger Millet Varieties : ఖరీఫ్ కు అనువైన రాగి రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు

రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది.

Finger Millet Varieties : ఖరీఫ్ కు అనువైన రాగి రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు

Finger Millet Varieties :

Updated On : July 27, 2023 / 7:45 AM IST

Finger Millet Varieties : నానాటికీ ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహణతో చిరుధాన్యాల వాడకం మళ్ళీ ఊపందుకుంది. ముఖ్యంగా ఒకప్పుడు చిన్నచూపకు గురైన జొన్నలు, కొర్రలు, రాగుల సాగు  ఇప్పుడు లాభదాయకంగా మారింది. అందుకు తగ్గట్లుగానే వీటిలో ప్రస్తుతం అధిక దిగుబడులనిచ్చేఎన్నో నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి.

READ ALSO : Green Gram Varieties : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి

చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు.  అయితే ఈ పంటలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు,  సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.  ఉమామహేశ్వరరావు.

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, కొర్రలు, రాగులు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల సాగు విస్థీర్ణం తగ్గిపోయింది. అయితే ఇందులోని పోషకవిలువలను గుర్తెరిగాక చిరుధాన్యాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించే చిరుధాన్యాల్లో చోడి ముఖ్యమైనది. దీన్నే రాగి, తైదలుగా కూడా పిలుస్తుంటారు.

READ ALSO : Intercropping : అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం, చీడపీడల నుండి పంటకు రక్షణ

రాగిలో పీచుపధార్ధం అధికంగా వుండటం, వరి గోధుమ కంటే  పోషకాల శాతం అధికంగా వుండటంతో… ఇటీవలికాలంలో మంచి పౌష్టికాహారంగా రాగి, అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. రాగిని ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగుచేస్తారు. వేసవి పంటగా కూడా సాగుచేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది.

ప్రస్తుతం అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.  ఉమామహేశ్వరరావు.

READ ALSO : Cotton Crop : తెలంగాణలో అధిక విస్తీర్ణంలో పత్తిసాగు.. తొలిదశలోనే కలుపు నివారించాలంటున్న శాస్త్రవేత్తలు

రాగిని నేరుగా విత్తే విధానంలోను లేదా నారును పెంచి నాటుకోవటం ద్వారా సాగుచేయవచ్చు. ఏ విధానమైన ఎకరాకు 3 నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. అయితే తప్పకుండా విత్తన శుద్ధిని చేయాలి. దీంతో పాటు సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులను అందించినట్లైతే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.