Ragi Rice Varieties : అధిక దిగుబడినిచ్చే రాగి రకాలు సాగు మెళకువలు

Ragi Rice Varieties : చిరుధాన్యపు పంటలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక సమస్యలకు పరిష్కారమంటున్నారు.

Ragi Rice Varieties : అధిక దిగుబడినిచ్చే రాగి రకాలు సాగు మెళకువలు

High yielding Ragi Rice Varieties

Updated On : January 9, 2025 / 2:31 PM IST

Ragi Rice Varieties : ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పడు పూర్వ వైభవం వస్తోంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్ళీ వీటి వాడకం పెరిగింది. దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాలలో ఒకటైన రాగిని ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. రబీ పంటగా నవంబరు నుంచి డిసెంబరు మాసాల్లో ఈపంటను సాగుచేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్ర్తవేత్త డా॥ సుధీర్ కుమార్..

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైధ్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని… తైదలు, చోడిగా వ్యవహరిస్తారు. రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే  మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

రాగిలో ఉండే పోషకవిలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది.వీటిని సంకటి, అన్నం, జావ తయారీతోపాటు, తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్  సుగుణాలు, హైటోకేమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.ఫలితంగా రక్తంలో చక్కెరస్ధాయి అదుపులో ఉంటుంది.  ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి గ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్ఠమైన ఆహారం.

ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు. అత్యదికంగా శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, ప్రకాశం , అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు సాగుచేస్తుంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలతో రైతులు ఎకరానికి 12-15 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. క్వింటా ధర 1500 -2000 పలుకుతుండటంతో రైతులు సాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాగి పంట విత్తటానికి డిసెంబర్ వరకు అనుకూలమంటూ, అనువైన రకాలు, సాగు వివరాలను తెలియజేస్తున్నారూ…  పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. సుధీర్ కుమార్ ..

రాగిని తెలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు , కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగుచేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కల పెట్టినట్లైతే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ఎకరాకు 4 టన్నుల పశుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతే కాకుండా సమయానుకూలంగానత్రజని, భాస్వరం, పొటాష్ ను  అందింస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.

నేరుగా విత్తే పద్ధతితో పాటు నారుపోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా రాగి పంటకు అగ్గితెగులు, మెడవిరుపు తెగులు, కంకితెగులు తోపాటు ఈ మధ్య గులాబి రంగు పురుగు  ఆశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది. సకాలంలో వీటిని గుర్తించి నివారించాలని శాస్త్రవేత్త సూచిస్తున్నారు. రాగి పంటలో ప్రస్థుతం మేలైన రకాలు అందుబాటులో వుండటం వల్ల మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుంచి 12క్వింటాళ్ల దిగుబడి సాధించే వీలుంది.

Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్‎లో వరి‎గట్లపై కూరగాయల సాగు