మహిళల జీవితాలను మార్చుతున్న ఐడియా.. ఇలా అధిక లాభాలు పొందుతూ..

వాటిని మహిళలు స్థానికంగా అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.

మహిళల జీవితాలను మార్చుతున్న ఐడియా.. ఇలా అధిక లాభాలు పొందుతూ..

Coffee Powder : ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ మంచి పేరుంది. ఇక్కడ పోడు వ్యవసాయం అధికం. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. అందుకే మంచి రుచి, రంగు, వాసన వస్తుంటుంది. చాలా మంది రైతులు పంటను పండించి గింజలను కంపెనీలకు అమ్ముతుంటారు. అయితే కొంత మంది మాత్రం ఇంట్లోనే కాఫీపొడిని తయారుచేసి అమ్ముకుంటూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఉమ్మడి విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంత ఇది. ఇక్కడి చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.

READ ALSO: భారత్‌లో రెడ్‌మి బడ్స్ 5 సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

కొంత మంది మాత్రం నాణ్యమైన గింజలను సేకరించి వేపిన తర్వాత పొడి చేసి మార్కెట్ లో అమ్ముతుంటారు. ఇలా అమ్మడం వల్ల అధిక ధర లభిస్తుంది. ఈకోవకు చెందిన వారే… తోట సత్యవతి. అనకాపల్లి జిల్లా, యలమంచిలి మండలం, ఏటి కొప్పాక గ్రామానికి చెందిన ఈమే గిరిజన ప్రాంతాల్లోని రైతుల వద్ద పిలక్కలను కొనుగోలు చేసి స్వయంగా ఇంట్లో కాఫీ పౌడర్ ను తయారు చేస్తుంది. చేసిన పౌడర్ ను స్థానికంగా అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.