Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో సమగ్ర యాజమాన్యం

Kharif Paddy Cultivation : తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది.

Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగులో సమగ్ర యాజమాన్యం

Kharif Paddy Cultivation

Kharif Paddy Cultivation : ఖరీఫ్ వరిసాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని, దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు.  ఆలస్యంగా నాట్లు వేసే రైతులు మధ్య, స్వల్పకాల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

అయితే వరిసాగులో అధిక దిగుబడులను సాధించాలంటే నారుమడి నుండి పంట కోత కోసే వరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి .

తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద మద్య, స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.

సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు.

కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో  కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్దమైన రైతులు వరిసాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు