Lemon Cultivation : నిమ్మసాగుతో సత్ఫలితాలు పొందుతున్న ప్రకాశం జిల్లా రైతు

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మతోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.

Lemon Cultivation : నిమ్మసాగుతో సత్ఫలితాలు పొందుతున్న ప్రకాశం జిల్లా రైతు

Lemon Cultivation

Lemon Cultivation : దీర్ఘకాలంపాటు రైతులకు ఫలసాయాన్నిచ్చే పండ్లతోటల్లో నిమ్మ ఒకటి. నాటిన 4వ సంవత్సరం నుంచి ఆర్ధికంగా అందివచ్చే నిమ్మలో, మొదటి 3 సంవత్సరాలు రైతులు అంతరపంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం వుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు గత 10 ఏళ్లుగా నిమ్మతోటలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.

దృఢంగా, ఆరోగ్యంగా పెరిగిన ఈ నిమ్మతోట వయసు 10 సంవత్సరాలు. నేల నల్లరేగడి. నిమ్మ చెట్లను నిశితంగా పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న ఈ రైతు పశ్చిమగోదావరి జిల్లా , కనిగిరి మండలం, చాకిరాల గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి. 20 ఏళ్లుగా వ్యవసాయంలో అనుభవం ఉన్న ఈయన, గతంలో కంది, మినుము, పొగాకు లాంటి పంటలు పండించేవారు.

అయితే, వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో దిగుబడులు పెద్దగా రాకపోయేది. వచ్చినా, మార్కెట్ లో ధరలు పలుకేదికాదు. దీంతో తనకున్న 4 ఎకరాల్లో నిమ్మతోటలను నాటారు. ఎకరాకు 100 మొక్కల చొప్పున 4 ఎకరాలకు 400 మొక్కలను నాటారు. అయితే నాటిన 3 ఏటనే దిగుబడి ప్రారంభమైనా, 4 వ ఏడాదినుండి అధిక దిగుబడులు వస్తాయి. పెట్టుబడులు అన్నిపోను, ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.

ఏడాదికి ఎకరాకు పెట్టుబడి రూ. 50 వేలు అవుతుంది. దిగుబడి 4 ఎకరాలకు 200 బస్తాల నిమ్మకాయలు వస్తాయి. వచ్చిన దిగుబడిని కదిరి  మార్కెట్ లో అమ్ముతున్న ఈ రైతు, అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు 1 లక్ష రూపాయల నికర ఆదాయాన్ని పొందుతున్నారు.

Read Also : Farming System : మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు – పంటలతో పాటు చేపలు, కోళ్లు, పశువులు పెంచుతున్న రైతు

Read Also :