Kharif Castor Cultivation : ఖరీఫ్ ఆముదం సాగులో మేలైన యాజమాన్యం

Kharif Castor Cultivation : ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. పంటకాలం 4-6నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే  డిసెంబరు నెలవరకు ఆముదం పంట కొనసాగుతుంది.

Kharif Castor Cultivation : ఖరీఫ్ ఆముదం సాగులో మేలైన యాజమాన్యం

Management in Kharif Castor Cultivation

నీటికొరత, కూలీల సమస్య ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ఆముదం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు అయినకాడికి పంట వస్తుందలే అనే రీతిలో ఆముదం సాగు వుండేది. కానీ హైబ్రిడ్ రకాల రాకతో దీని సాగు రూపురేఖలు మారాయి. తక్కువ శ్రమ, ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా వాణిజ్యసరళిలో రైతులు ఈ పంటసాగుకు ముందడుగు వేస్తున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. పంటకాలం 4-6నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే  డిసెంబరు నెలవరకు ఆముదం పంట కొనసాగుతుంది. రెండు, మూడు నీటితడులిస్తే పంటకాలాన్ని మరింత పొడిగించే అవకాశం వుంది. సాధారణంగా ఆముదం విత్తిన తర్వాత వర్షాలు ఆశాజనకంగా వుంటే బెట్టకు గురయ్యే అవకాశాలు తక్కువగా వుంటాయి. బీడు, బంజరు భూములు, ఎగుడు, దిగుడు భూముల్లో సైతం రైతులు ఆముదం సాగుచేసి ఆదాయం పొందవచ్చు.

ఖరీఫ్ ఆముదం నుంచి 4-5సార్లుగా గెల దిగుబడి వస్తుంది. ఆముదం నూనె తీయగా వచ్చిన చెక్క మంచి సేంద్రీయ ఎరువు. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందంటూ ఈ పంటకున్న ప్రాధాన్యతను, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి  వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త భార్గవి.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు