Cotton Crop : ప్రస్తుతం పత్తిలో వేయాల్సిన ఎరువులు
Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 30 - 50 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది.
Cotton Crop : తెలుగు రాష్ట్రాల్లోని మెట్టప్రాంతాల్లో… వర్షాధారంగా పత్తి విస్తారంగా సాగవుతోంది. ప్రస్థుతం కొన్నిప్రాంతాల్లో అధిక వర్షాలతోపాటు, బెట్ట పరిస్థితలు ఉన్నాయి. ఈ సమయంలో పంటలను కాపాడుకునేందుకు ఎలాంటి ఎరువుల యాజమాన్యం పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రఘువీర్ .
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పత్తి 30 – 50 రోజుల దశలో ఉంది. ఈ ఏడాది పత్తి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పత్తిని మొదట విత్తిన రైతులు మళ్లీ విత్తుకోవాల్సి వచ్చింది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు కొన్ని చోట్ల పంట దెబ్బతింది. ప్రస్తుతం అక్కడక్కడ అడపా దడపాక వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల బెట్ట పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త రఘువీర్.
Read Also : Papaya Cultivation : బొప్పాయి నర్సరీతో బోలెడంత ఆదాయం