Organic Farming : సేంద్రియ వ్యవసాయ పద్దతులపై శిక్షణ
Organic Farming : వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి.
Organic Farming : సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతుంది. రసాయన రహిత వ్యవసాయం చేసి నాణ్యమైన పంటల తీసే రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే గత రెండేళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్న గూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో లైన్ సోయింగ్ విధానంలో వరి సాగు
వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల, అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహరం తయారవుతోంది.
గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటినన్నీటి అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏవిధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ.. శిక్షణ ఇస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్న గూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
Read Also : Paddy Crop : వరి పొలాల్లో అధికంగా యూరియా వాడుతున్న రైతులు – అవసరం మేరకే వాడాలంటున్న శాస్త్రవేత్తలు