Mixed Farming : సిరులు కురిపించే.. అంతర పంటలు

కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచి ఆదాయం పొందవచ్చు. ఇలా అంతర పంటల సాగుతో అధిక లాభాలను పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

Mixed Farming : సిరులు కురిపించే.. అంతర పంటలు

Mixed Farming for Agriculture Tips

Updated On : January 28, 2024 / 4:38 PM IST

Mixed Farming : వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ప్రతికూల పరిస్ధితులు ఎలా ముంచుకొస్తాయో ఉహించలేం.. ఏ తెగులు ఎప్పుడు, ఏ పంటను ఆశిస్తుందో అంచనా వేయలేం.. ఎంతనష్టం కలిగిస్తుందో బేరీజు వేయలేం.. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచి ఆదాయం పొందవచ్చు. ఇలా అంతర పంటల సాగుతో అధిక లాభాలను పొందుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం  

మిశ్రమ పంటల సాగు : 
వ్యవసాయాన్ని వ్యాపారం లాగా చేస్తేనే అధిక లాభాలు గడించవచ్చు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేస్తూ.. పంట వెనుక పంట దిగుబడులు వచ్చే విధంగా మిశ్రమ పంటలు సాగు చేస్తే… ఇక లాభాలకు కొదవ ఉండదు. ఒక వేల ప్రకృతి వైపరిత్యాలు వచ్చినా.. మార్కెట్ లో ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా… ఒక పంట కాకపోతే మరో పంటలోనైనా మంచి ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ఈ సూత్రన్నే పాటిస్తూ.. ఎకరంలో 4 పంటలు సాగుచేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, రామన్న గూడెం కు చెందిన రైతు మద్దిపాటి రవితేజ.

రైతు రవితేజ చదివింది ఎంబీఏ. అదికూడా లండన్ లో పూర్తి చేశారు. కానీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకున్న భూమిలో వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ఎకరంలో మిశ్రమ పంటల సాగును చేపట్టారు. శాశ్వత పందిర్లపై తీగజాతి పంటలు పండిస్తూనే.. ఆ పందిర్ల కింద మిర్చి.. బంతి పూలను సాగుచేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో.. ఒక పంట తరువాత ఒక పంట వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని సాగుచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లోనే అమ్ముతూ… మంచి లాభాలు పొందుతున్నారు.

Read Also : Crop Protection in Maize : మొక్కజొన్నలో ఎరువులు, సస్యరక్షణ