Paddy Cultivation : వరిపైరుకు సుడిదోమ పోటు.. నివారణకు అధికారుల సూచనలు
వరిలో అధిక దిగుబడిని పొందాలనే ఆశతో రైతులు అధిక మోతాదులో నత్రజనిని వాడటం వలన పొడతెగులు సోకుతుంది. పిలక, దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమలపైన కాండం మీద, రెండు , మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్పడతాయి.

Paddy Cultivation
Paddy Cultivation : మన ప్రధాన ఆహారపంట వరి . ఖరీఫ్ లో నాటిన వరిపంట ప్రస్తుతం వరి పిలకదశ నుంచి గింజలు పాలుపోసుకునే దశ వరకు వుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సుడిదోమ, పొడతెగులు ఆశించినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారులు .
READ ALSO : Organic Prawn Farming : ఆర్గానిక్ పద్ధతిలో రోయ్యల సాగు
శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2 లక్షల 30 వేల హెక్టార్లలో వరి సాగవుతుంది. రైతులు అధిక విస్తీర్ణంలో సన్నగింజ రకాలనే సాగుచేస్తున్నారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో సుడిదోమ , పొడతెగులు చాలా ప్రాంతాల్లో ఆశించి , తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పొడతెగులు శిలీంధ్ర బీజాల ద్వారా వ్యాపిచెందుతుంది. సుడిదోమ ఉధృతి వలన పైరు సుడులు సుడులుగా ఎండిపోతోంది. రైతులు వీటిని గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే వీటి నుండి పంటను కాపాడుకొని మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. సుడిదోమ నివారణకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు.
READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వరిలో అధిక దిగుబడిని పొందాలనే ఆశతో రైతులు అధిక మోతాదులో నత్రజనిని వాడటం వలన పొడతెగులు సోకుతుంది. పిలక, దుబ్బు చేసే దశలో నీటి మట్టానికి దగ్గరగా ఉండే ఆకుల తొడిమలపైన కాండం మీద, రెండు , మూడు సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ వృత్తాకారంలో మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పాము పొడ ఆకారం పోలి ఉంటాయి. వీటిని గమనించినట్లైతే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది. ఆకులు బాగా పెరిగి నేల కనబడకుండా కప్పుతాయి. ఆకుల కింద గాలిలో తేమశాతం పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడుల మధ్య ఉంటుంది.
READ ALSO : Kharif Chilli Cultivation : ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్దమవుతున్న రైతులు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
ఈ పరిస్థితులన్నీ సుడిదోమ అభివృద్ధికి అనుకూలమైనవి. వీటికి తోడు రైతులు విచక్షణారహి తంగా క్రిమిసంహరక మందులు వాడటంతో సుడిదోమకు సహజ శత్రువులైన సాలె పురుగులు, తూనీగలు, మిరిడ్‌బగ్స్, అక్షింతల పురుగులు చనిపోతాయి. సహజ శత్రువులు లేకపోవడంతో సుడిదోమలు నిరాటంకంగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సుల మేరకే రైతులు పురుగు మందులు, ఎరువులను వాడాలి.