Rice Varieties : ఖరీఫ్‌కు అనువైన సన్న, మధ్యస్థ, దొడ్డుగింజ వరి రకాలు

Rice Varieties for Kharif : తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 నుండి 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. 

Rice Varieties : ఖరీఫ్‌కు అనువైన సన్న, మధ్యస్థ, దొడ్డుగింజ వరి రకాలు

paddy varieties for kharif season in telugu

Rice Varieties for Kharif : ఖరీఫ్ వరిసాగు ప్రారంభమైంది. ఇప్పటికే చాలా మంది రైతులు దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు. స్వల్ప, అతిస్వల్ప కాలిక రకాలను సాగుచేయాలనుకునే వారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. అసలు వానాకాలం పంట సాగుకు అనువైన సన్నగింజ , మధ్యస్థ గింజ, దొడ్డుగింజ రకాలు ఏవి.. వాటిని గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోటా శివకృష్ణ.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 నుండి 60 లక్షల ఎకరాల్లో సాగవుతుంది.  చాలా వరకు దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తుంటారు రైతులు. ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు, వడగళ్లు, కురవడంతో పంట మొత్తం నేలపాలవుతోంది.

ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.  మధ్య కాలిక రకాలు జులై మొదటి వారం వరకు పోసుకునే అవకాశం ఉండగా  స్వల్ప కాలిక రకాలు జులై చివరి పోసుకోవచ్చు. అసలు ఖరీఫ్ కు అనువైన సన్నగింజ రకాలేంటీ..? వాటి గుణగణాలేంటో  రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కోటా శివకృష్ణ .

ఖరీఫ్ లో సన్నగింజ రకాలతో పాటు మధ్యస్థ, దొడ్డుగింజ రకాలను సైతం పండింస్తుంటారు రైతులు. కానీ ఏరకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అంలాంటి వారికోసం ఖరీఫ్ కు అనువైన మధ్యస్థ, దొడ్డుగింజ రకాలు.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు