Pest Control in Chickpea : రబీ శనగ పంటలో చీడపీడల నివారణ
Pest Control in Chickpea : ఇటీవల కురిసిన తుఫాను ప్రభావం.. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉదృతి పెరింగి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు.

Pest Control in Chickpea
Pest Control in Chickpea : మంచును తేమగా ఉపయోగించుకుని పెరిగి అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం పంట శనగ. ప్రస్తుతం రబీలో వేసిన పంట 15 నుండి 25 రోజుల దశలో ఉంది. అయితే మారిన వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
Read Also : Azolla Cultivation : అజొల్లా పెంపకంతో రైతులకు లాభాలు.. మరెన్నో ఉపయోగాలు
వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉదృతి :
రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ వుండే నల్లరేగడి భూముల్లో రబీపంటగా మంచును ఉపయోగించుకుని పెరగ గల పంట ఇది. వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉదృతి పెరుగుతోంది. తేమ అధికంగా ఉంటే తెగుళ్లు ఆశిస్తాయి
అందుకే ఆదిలాబాద్ జిల్లాలో రైతులు రెండో పంటగా ఎక్కువగా శనగనే సాగుచేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన తుఫాను ప్రభావం.. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉదృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
శనగను ఆశించే తెగుళ్లు :
ఎండు తెగులు వేరుకుళ్లు
శనగను ఆశించే పురుగుల
శనగపచ్చపురుగు లద్దెపురుగు
ఎండుతెగులు నివారణ :
కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.
లీటరు నీటికి కలిపి మొక్క మొదల్లో పోయాలి
టెబుకొనజోల్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ప్లోకోరోజ్ 1.5 గ్రా.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
వేరుకుళ్లు నివారణ :
కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా టెబుకొనజోల్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
ఎండుతెగులు నివారణ :
క్యాప్టాన్ + హెక్సాకొనజోల్ (తాకత్) 1.5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
శనగపచ్చ పురుగు నివారణ :
ఎకరాకు లింగాకర్షక బుట్టలు 2-4 అమర్చుకోవాలి
శనగపచ్చ పురుగు నివారణ :
ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా
క్లోరాంట్రినిలి ప్రోల్ 0.3 మి. లీ. లేదా ల్యామ్డాసైహోలిత్రిన్ 1 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రబ్బరు పురుగుల నివారణ :
ఇమామెక్టిమ్ బెంజోయేట్ 0.5 గ్రా. లేదా
నోవాల్యూరాన్ 1 మి. లీ. లేదా ఇమామెక్టిమ్ బెంజోయేట్ + నోవాల్యూరాన్ 1.6 మి. లీ. లేదా
ఇండాక్సోకార్బ్ + నొవాల్యూరాన్ 1.6 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
Read Also : Paddy Cultivation : వరినారుమళ్లపై శీతల గాలుల ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు