Jana Nayagan: జన నాయగన్ పరిస్థితి ఏంటో తెలియదు.. కానీ, భగవంత్ కేసరికి బాగా కలిసొచ్చింది.. దెబ్బకు టాప్ లోకి

విజయ్ హీరోగా వస్తున్న జన నాయగన్(Jana Nayagan) ట్రైలర్ రిలీజ్ తరువాత ఓటీటీలో భగవంత్ కేసరి సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.

Jana Nayagan: జన నాయగన్ పరిస్థితి ఏంటో తెలియదు.. కానీ, భగవంత్ కేసరికి బాగా కలిసొచ్చింది.. దెబ్బకు టాప్ లోకి

Due to Jana nayagan movie Bhagavanth Kesari now trending on OTT.

Updated On : January 5, 2026 / 11:25 AM IST
  • విజయ్ జన నాయగన్ ఎఫెక్ట్
  • ఓటీటీ టాప్ లో ట్రెండ్ అవుతున్న భగవంత్ కేసరి
  • బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

Jana Nayagan: తమిళ హీరో విజయ్ తలపతి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. ఇదే సినిమాను తెలుగులో జన నాయకుడు పేరుతో విడుదల చేస్తున్నారు. హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, పూజ హెగ్డే కీ రోల్స్ చేస్తున్నారు. ఈమధ్యే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకే, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుంది అని ఆడియన్స్, మరీ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, జన నాయగన్ సినిమా విషయంలో ముందు నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదేంటంటే, ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని.

Mamitha Baiju: బ్లాక్ శారీలో మమిత గ్లామర్ టచ్.. వైరల్ అవుతున్న ఫొటోలు

కానీ, మేకర్స్ మాత్రం జన నాయగన్(Jana Nayagan) అనేది రీమేక్ కాదని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, ఇటీవల జన నాయగన్ ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత తెలిసిందే ఇది పక్కా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని. కాకపోతే, విజయ్ ప్రస్తుత పొలిటికల్ కెరీర్ కి సెట్ అయ్యేలా కథను కాస్త చేంజ్ చేశారు. దీంతో, జన నాయగన్ సినిమా కథ ఏంటో తెలుకోవడానికి ఓటీటీలో భగవంత్ కేసరి సినిమా చూస్తున్నారు ఆడియన్స్.

దీంతో, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో భగవంత్ కేసరి సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. దెబ్బకు టాప్ లోకి వెళ్ళింది ఈ మూవీ. ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన కూడా చేశారు. ఎలా అయితేనేం, జన నాయగన్ సినిమా వల్ల ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది.