Chiru- Charan: మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్.. బాస్, పెద్ది కలిసి వస్తున్నారు.. పండగ చేస్కోండి

సంక్రాంతికి పండగకి ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయిన చిరంజీవి-రామ్ చరణ్(Chiru- Charan).

Chiru- Charan: మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్.. బాస్, పెద్ది కలిసి వస్తున్నారు.. పండగ చేస్కోండి

Ram charan peddi movie second song update

Updated On : January 5, 2026 / 9:00 AM IST
  • మెగా హీరోస్ సంక్రాంతి ట్రీట్
  • మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్
  • రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్

Chiru- Charan: మెగా ఫ్యాన్స్ పండగలాంటి వార్త. ఈ సంక్రాంతికి మెగాస్టార్, మెగా పవర్ స్టార్(Chiru- Charan) ఇద్దరు కలిసి ఆడియన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆ ట్రీట్ ఏంటో తెలుసా. ఒకరి మన శంకరవరప్రసాద్ గారు మూవీ రిలీజ్. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండటం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడంతో మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక రెండో ట్రీట్ ఏంటంటే, పెద్ది నుంచి రెండో సాంగ్. అవును, రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి రెండో పాటను విడుదల చేయాలనీ టీం భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్.

Devi Sri Prasad: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ కి దేవిశ్రీ స్టెప్పులు.. వీడియో మాత్రం ఒక రేంజ్ లో ఉంది

ఇక పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన చికిరి సాంగ్ ఎంత పెద్ద చాట్ బ్లాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. రీల్స్, సోషల్ మీడియా ఎక్కడ చూసిన అదే సాంగ్ వినిపించింది. దాంతో, పెద్ది సినిమా నుంచి రానున్న రెండో సాంగ్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక పెద్ది నుంచి వస్తున్న రెండో పాత రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ కూడా మాస్ బీట్ తో ఒక రేంజ్ లో ఉంటుందట. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేయనున్నాయట. దీంతో, మెగా ఫ్యాన్స్ పెద్ది రెండో పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ పాట ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది చూడాలి. పెద్ది సినిమా మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.