Chicken : చికెన్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. కిలో చికెన్ రూ.400కు చేరుతుందా..? కారణాలు ఇవే..

Chicken prices increased : చికెన్, కోడి గుడ్డు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.300 దాటేసింది. రాబోయే రోజుల్లో కిలో రేటు రూ.400 కు చేరుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధర కూడా భారీగా పెరిగింది.

Chicken : చికెన్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. కిలో చికెన్ రూ.400కు చేరుతుందా..? కారణాలు ఇవే..

Chicken

Updated On : January 5, 2026 / 9:12 AM IST

Chicken prices increased : పండుగొచ్చినా.. ఆదివారం వచ్చినా.. ఫ్రెండ్స్, చుట్టాలు ఇంటికొచ్చినా పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా చికెన్ కూర రెడీ చేస్తారు. సండే వచ్చిందంటే చాలు అధికశాతం ఇండ్లలో చికెన్ కూర ఉండాల్సిందే. అయితే, ప్రస్తుతం చికెన్ ధరలు అనూహ్యంగా పెరుగుతూ మాంసాహారులను బెంబేలెత్తిస్తున్నాయి. గత డిసెంబర్ నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు, ఇప్పుడు రికార్డు ధరలను నమోదు చేస్తున్నాయి.

Also Read : Health Care : యూరియాతో పండిన ఆహారంతో యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం.. క్యాన్సర్, కడ్నీ వ్యాధులు కూడా..

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.300 దాటేసింది. ఇక హైదరాబాద్ మార్కె‌ట్‌లో చికెన్ ధర మరింత ఎక్కువగా ఉంది. ఆదివారం కేజీ (స్కిన్‌లెస్) చికెన్ ధర ఏకంగా రూ.300 దాటింది. ఈ సీజన్లో నమోదైన అత్యధిక ధర ఇదేనని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండగ కూడా సమీపిస్తుండడం, దీనికితోడు డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

Chicken prices increased

గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చికెన్, కోడి గుడ్డు ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుడి గుండెల్లో దడ మొదలైంది. ఒక్క కోడి గుడ్డు ధర రూ.7.50 నుంచి రూ.8 వరకు పలుకుతుంది. చికెన్ ధర అయితే కిలో మీద వారంలో ఒక్కసారిగా రూ.50 పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.300 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో రూ.400 వరకు ధరలు పెరుగుతాయని చికెన్ షాప్ యజమానుల పేర్కొంటున్నారు. చికెన్ ధరలు భారీగా పెరగడానికి మరో కారణం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

Chicken prices

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భాగంగా దాదాపు పదిహేను నుంచి 20రోజుల పాటు పల్లెల్లో దావత్ ల జోరు కొనసాగింది. దీంతో చికెన్ ను భారీ మొత్తంలో వినియోగించారు. మరోవైపు చాలా గ్రామాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికి కిలో చికెన్‌ను ఉచితంగా అందజేశారు. దీంతో చికెన్ వినియోగం భారీగా పెరగడంతో ఫౌల్ట్రీ ఫామ్ లలో కోడి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి లేక చికెన్ ధరలు పెరుగుతున్నట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు కిలో చికెన్ రేటు రూ.300 నుంచి రూ.400 మధ్యలో ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు చికెన్, గుడ్డు ధరల భారం సామాన్య కుటుంబాలను మెటాడుతూనే ఉంటుందంటున్నారు.