Papaya Cultivation : బొప్పాయి సాగులో తెగుళ్ళు, నివారణా చర్యలు

రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగుళ్ళ కారణంగా పంట నాణ్యతతోపాటు, దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.

Papaya Cultivation : బొప్పాయి సాగులో తెగుళ్ళు, నివారణా చర్యలు

Boppaya (1)

Papaya Cultivation : బొప్పాయి, అధిక పోషక విలువులు కలిగిన పండ్ల జాతిలో ఒకటి. దీనిలో విటమిన్ ఎ, సి, ఇనుము , కాల్షియం, భాస్వరము తదిర పోషకాలు అధికంగా ఉంటాయి. బొప్పాయిని తినేందుకు చాలా మంది బాగా ఇష్టపడతారు. బొప్పాయిని కేవలం పండుగానే కాకుండా వీటిని నుండి పాలను సేకరించి పపెయిన్ అనే ఎంజైమును తయారు చేస్తారు. మందుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు.

బొప్పాయి సాగు చేపట్టిన రైతులు సస్యరక్షణ చర్యల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే బొప్పాయి సాగులో మంచి దిగుబడుడులు పొందటమేకాదు, లాభాలు తీయ్యవచ్చు. తొమ్మిది మాసాల నుండి రెండు సంవత్సరాల వరకు కాపునిచ్చే బొప్పాయి సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఈపంటసాగు సమయంలో వైరస్, బ్యాక్టీరియా తెగుళ్ళ ఉధృతి అధికంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటను కాపాడుకోవాలి.

బొప్పాయిని ఆశించి తెగుళ్ళలో ముఖ్యమైనది కాండం కుళ్ళు తెగులు. వర్షకాలంలో ఈ తెగులు అధికంగా ఉంటుంది. అధిక నీరు నిల్వ ఉండటం వల్ల కాండం కుళ్ళిపోవటం జరుగుతుంది. తద్వారా చెట్టు చనిపోతుంది. దీని నివారణకు మొక్క మొదలు వద్ద నీరు నిల్వకుండా చూసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి బొప్పాయి మొక్కల మొదలు వద్ద ఈ మిశ్రమాన్ని పోయాలి.

బొప్పాయి కాయలు పక్వానికి వచ్చే దశలో పండు ఈగ బెడద తీవ్రగా ఉంటుంది. కాయలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు మిథైల్ యుజినల్ ఎర బుట్టలను ఉపయోగించి పండు ఈగలను ఆకర్షించే విధంగా చేయాలి. ఈ బుట్టల్లో చిక్కిన పండు ఈగలను నాశనం చేసుకోవాలి. తోటను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే పండు ఈగ సమస్య రాకుండా ఉంటుంది.

రసం పీల్చే పురుగులు, పేను బంక , తెల్లదోమ , మొజాయిక్, రింగ్ స్పాత్ వంటి వైరస్ తెగుళ్ళు కారణంగా బొప్పాయి పంట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగుళ్ళ కారణంగా పంట నాణ్యతతోపాటు, దిగుబడులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రసం పీల్చే పురుగులను పొలంలో గమనించిన వెంటనే ప్రొఫెనోపాస్ ఒకలీటరు నీటికి 2మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి. రెండవ దశలో ఇమిడా క్లోప్రేడ్ 0.3 మిల్లీలీటర్లు ఒక లీటరుకు కలిపి పిచికారి చేయాలి.

బొప్పాయిని ఆశించే చీడపీడల్లో పిండినల్లి ముఖ్యమైనది. కాయల నుండి రసం పీల్చటం వల్ల కాయలు రంగుమారిపోతాయి. దీని నివారణకు 2మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. నులి పురుగుల నివారణకు 250 గ్రాముల వేప పిండి, కర్బోఫ్యురాన్ 3జి గుళికలు, సుదోమొనాస్ ఫొరిసెన్స్ 4గ్రాముల చొపున ఒక్కో మొక్కకు వేయాలి. పురుగులను ఆకర్షించేందుకు పొలంలో అక్కడక్కడ పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం.