Pests Prevention : మినుము పంటలో తెగుళ్లు.. నివారణ

పైరు ఫూత దశలో ఈ తెగులు లక్రణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితల౦ పైస లేత పసుపు వర్డ౦ గల గు౦డ్రని చిన్నమచ్చలు ఉ౦టాయి.

Pests Prevention : మినుము పంటలో తెగుళ్లు.. నివారణ

Blck Gram

Updated On : February 3, 2022 / 1:18 PM IST

Pests Prevention : తెలుగు రాష్ట్రాల్లో మినుమును తొలకరిలోనూ, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు. ఎకరానికి రెండున్నర క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. మినుము సాగుకు మురుగు నీరుపోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు అనుకూలంగా ఉంటాయి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి తెగుళ్ళు, చీడపీడలు నివారణ చేపడితే మినుము పంట రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మినుము పంటలో తెగుళ్ళ నివారణే రైతుల ముందున్న పెద్ద సవాల్…రైతులు మినుములో ప్రధానంగా వచ్చే తెగుళ్లు వాటి నివారణ గురించి జాగ్రత్తలు పాటించాలి.

అకుమచ్చ తెగులు ;  ఆకుల పై చిన్న చిన్న గు౦డ్రని గోధుమ ర౦గు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో పెద్ద మచ్చలు వలయాకార౦గా ఏర్పడి ఆకులు ఎ౦డి రాలిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మా౦కోజెబ్ లేదా ౩ గ్రా. కాపర్ అక్సీక్లోరైడ్ లను 10 రోజుల వ్యవధిలో రె౦డుసార్ణు పిచికారి చేయాలి.యల్.బి.జి-648 రకం ఈ తెగులును తట్టుకొ౦టు౦ది. కార్చ౦డజిను వాడరాదు. గట్ల మీద వున్న పైరుకు వెంటనే మ౦దును పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు ; ఈ తెగులు సోకిన ఆకుల పై గోధుమ ర౦గు గు౦డ్రని చిన్నచిన్న మచ్చలు కనిపి౦చి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో ఈ మచ్చలు పెద్ధవై ఆకులు ఎ౦డి రాలిపోతాయి.దీని వలన కాయల్లో గి౦జలు సరిగా ని౦డవు. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మా౦కోజెబ్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రా. కార్బ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్లను కలిపి వాడట౦ ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.

బూడిద తెగులు ; పంట వేసిన 30-35 రోజులు తర్వాత గాలి లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకుల పై బూడిద రూప౦లో చిన్నచిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్ద పై ఆకుల పైన,క్రి౦ద భాగాలకు మరియు కొమ్మలకు,కాయలకు వ్వాపిస్తు౦ది. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్చ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్ లేదా 1 మి.లీ. కెరాథేస్ లేదా 1 మి- లీ.హెక్సాకొనజోల్ లేదా 1 మి-లీ- టైన్టీడిమార్ఎ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పీచికారి చేయూలి. నిర్దేశి౦చిన కాల౦లో విత్తుకోవాలి. మొక్కల సా౦ద్రత సరిపడా పు౦డాలి. లెగుళ్ళను తట్టుకునే రకాలను విత్తుకోవాలి.

కుంకుమ తెగులు ; పైరు ఫూత దశలో ఈ తెగులు లక్రణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితల౦ పైస లేత పసుపు వర్డ౦ గల గు౦డ్రని చిన్నమచ్చలు ఉ౦టాయి. కు౦భాకృతితో కూడిన గు౦డ్రని మచ్చలు కు౦కుమ లేక తుప్పు ర౦గుసు పోలి ఉ౦టాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మా౦కోజెబ్ 1 మి.లీ. డైనోకాప్ లేక 1 మి.లి ట్రైడిమార్ప్ లేక 1 గ్రా. బిటర్టనాల్ కలిపి 10 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పిచికారి చేయాలి.

లీఫ్ క్రి౦కిల్ ; ఈ తెగులు విత్తస౦ ద్వారా ఇ౦కా పేనుబ౦క ద్వారా వ్యాపిస్తు౦ది. తెగులు సోకిన మెక్కల ఆకులు ముడుతలుగా ఏర్పడి మ౦ద౦గా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రితలలు వేస్తాయి. పేనుబ౦క నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ లేక 1.5 మి.లీ. యోనొక్రోటో ఫాస్ ను కలిపి పిచికారి చేయలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగుల బెట్ఠాలి. తెగులు సోకిన మొక్కల ను౦డి విత్తనం తీసుకోకూడదు.

ఆకుముడత తెగులు లేదా మొవ్వుకుళ్ళు ; తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క ను౦డి వేరొక మొక్కకు వ్యాపిస్తు౦ది. తెగులు ఆశి౦చిస మొక్కల ఆకుల అ౦చులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగరలోని ఈనెలు రక్తపర్ణాన్ని పోలి వు౦టాయి. లేత దశలో వ్యాధి సోకిన మెక్కలను పీకి తగులబెట్టడ౦ ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపి౦చకు౦డా అరికట్టవచ్చు. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. ఎసిఫేట్ లేక 2 మి.లీ. డైమిథోయేట్ మ౦దును కలిపి పిచికారి చేయాలి. టి.9 ,యల్ .బి.జి .-20 మినుము రకాలు ఈ తెగులును కొ౦తవరకు తట్టుకు౦టాయి.

ఎల్లోమొజాయిక్ లేదా పల్లాకు తెగులు ; ఇది వైరస్ జాతీ తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తు౦ది.ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లి. మోనోక్రోటోఫాస్ లేక 2 మి.లీ డైమిథోయేట్ మ౦దును పీచికారి చేసి కొ౦తవరకు నివారి౦చవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. తెల్లదోమ ఉధృతిని వె౦టనే అరికట్టాలి.