Pests of Groundnut : శనగలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Agri Information : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ  రైతుల ఆదరణ పొందుతోంది.

Pests of Groundnut : శనగలో శనగపచ్చ పురుగుల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Agri Information

Updated On : December 28, 2024 / 5:03 PM IST

Pests of Groundnut : మంచును తేమగా ఉపయోగించుకుని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటలో ప్రస్తుతం శనగ పచ్చపురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ  రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ వుండే నల్లరేగడి భూముల్లో రబీపంటగా మంచును ఉపయోగించుకుని పెరగ గల పంట ఇది. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు మొదటి పక్షం వరకు అనుకూలం. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, తెలంగాణలో మాత్రం 1 లక్షా 20 వేల హెక్టార్లలోనే సాగవుతుంది. అయితే ఈ సారి వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుచేయాలని, ప్రభుత్వం చెప్పడంతో , సాగువిస్తీర్ణం పెరిగింది.

అయితే, ప్రస్తుతం చాలా చోట్ల శనగ పంటలో, శనగపచ్చపురుగు ఆశించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురుగు ఎక్కువ నష్టం కలిగిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో బాగా అరికట్టగలిగినా, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం వలన, పర్యావరణానికి హాని కలుగకుండా, సహజమిత్ర పురుగులను పరిరక్షించి, పురుగు మందుల నిరోధకశక్తి పెరగకుండా కాపాడవచ్చు.

పురుగు సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో ఒక మీటరు ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని, పురుగు ఉధృతి బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. పంటలో శనగ పచ్చపురుగును గమనించినట్లైతే , పురుగుల లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లు, తొలిదశ లార్వాల నివారాణకు, వేపగింజల కషాయం 5 శాతం  పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే, స్పైనోసాడ్ 0.3 మిల్లీ లీటర్ల మందును, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం