Planting Papaya : పామాయిల్‌లో బోప్పాయి నాటిన రైతు

మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు . ఉద్యాన అధికారుల సలహాలు సూచనలో పంటలు పండిస్తున్నారు.

Planting Papaya : పామాయిల్‌లో బోప్పాయి నాటిన రైతు

Planting Papaya in Palm Oil

Planting Papaya : తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక, రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యానశాఖ ప్రోత్సాహంతో పామాయిల్ సాగుచేశారు. అంతర పంటగా బొప్పాయి సాగుచేస్తున్నారు.

Read Also : Lemon Cultivation : నిమ్మసాగుతో సత్ఫలితాలు పొందుతున్న ప్రకాశం జిల్లా రైతు

ఇదిగో ఇక్కడ చూడండీ.. ఈ తోటను. మొత్తం 6 ఎకరాల్లో విస్తరించిన ఈ తోట విజయనగరం జిల్లా, ఎల్. కోట మండలం , దాసరి పాలెం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని సంతపూరి సతీష్ . ప్రస్తుతం పామాయిల్ మొక్కలు వయస్సు  ఏడాది.. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి, మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు . ఉద్యాన అధికారుల సలహాలు సూచనలో పంటలు పండిస్తున్నారు.

మన దేశం ఏటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది. దీని విలువ వేలకోట్లలో ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా మిగితావి సోయా, సన్ ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. ఈ నేపధ్యంలో దేశీయంగా ఆయిల్ ఫామ్ తోటల విస్తీర్ణం , ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఇందుటో భాగంగానే ఏపి ప్రభుత్వం  రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. వీటికి తోడు తోటల నిర్వాహణ, అంతర పంటలు, డ్రిప్ , ఎరువులు, ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది.

Read Also : Turmeric Farming : పసుపు తీతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నాణ్యమైన పసుపు ఉత్పత్తితో అధిక ధర