Turmeric After Harvesting : పసుపు పంటకోత అనంతరం ఉడికించటం, ఆరబెట్టటంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు
పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను , పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బానలలో దుంపలు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగి పసుపుతో కూడిన వాసన పొగలు వస్తాయి.

Turmeric
Turmeric After Harvesting : పసుపు పంట 210 నుండి 270 రోజులకు తవ్వకానికి వస్తుంది. పసువు పంట పక్వానికి చేరుకున్న కొద్దీ మొక్కల అకులు ఎండడం ఆరంభమవుతాయి. మొక్కలు ఎండిపోయే వరకు పంట కోయరాదు. పసువును త్రవ్వే రెండు రోజుల ముందు మొక్క అకులు, కాండాలను భూ మట్టానికి కోయాలి. తరువాత నీరు పెట్టిన 2 రోజుల తర్వాత దుంపలు త్రవ్వకం ప్రారంభించాలి. త్రవ్వి తీసిన వారం లోపల ఉ డకబెడితే పసుపు నాణ్యత బాగా ఉంటుంది.
READ ALSO : Semi-Jamili Elections : జనవరిలో ఏపీ, తెలంగాణలతో లోక్‌సభ ఎన్నికలు?
పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను , పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బానలలో దుంపలు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగి పసుపుతో కూడిన వాసన పొగలు వస్తాయి. అప్పుడు పసుపును నొక్కితే మెత్తగా ఉంటుంది. చిన్న వుల్లను గుచ్చినట్లయితే లోనకు దిగబడుతుంది. పసుపు ఉడికింది అనడానికి ఇదే గుర్తు. పసుపును బయటకి తీయాలి. పసుపు ఉడికించేందుకు వాడే నీరు శుభంగా ఉండాలి. పేడ కలపరాదు.
వసువును ఉడకబెట్టడంలో మేలైన వద్ధతులు :
50 కిలోల తల్లి దుంపలను గాని, విల్ల దుంపలు గాని తీసుకొని సైజు గల జల్లెడ రంద్రాలు గల ఇనుప తొట్టెలో పోయాలి. దీనిని కొంచెం పెద్ద సైజు గల ఇనుప కడాయిలో దించాలి. దుంపలు మునిగే వరకు నీరు పోయాలి. ఉడికిన తరువాత దుంపలున్న తొట్టిని పైకి లేపి పరిశుభమైన స్థలంలో పోసి, తిరిగి తొట్టెలో వేరే దుంవలు పోసి ఉడికించాలి.
READ ALSO : Turmeric Crop : అధిక వర్షాలతో పసుపుకు తెగుళ్ల బెడద
పనువు ఆరబెట్టడం :
సమంగా ఉడికిన పసుపును బయట చదునైన శుభ్రమైన టార్చాలిన్ లేదా సిమెంటు ప్లాట్‌ఫాంపై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత 2,8 అంగుళాల మందం ఉండేలా పరచాలి. పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. 10-15 రోజులకు పసుపు ఎండుతుంది. 8 శాతం తేమ ఉండేవరకు ఎండబెట్టి నిలువ చేయాలి. ఉడికిన పసుపు తడిస్తే పసుపు నారింజ రంగు వస్తుంది. కాబట్టి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పసుపు ఆరబెట్టేటప్పుడు అష్హాటాక్సిన్ అనే విషపదార్ధం చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉడికిన పసుపు తొందరగా ఎండకపోవడం వలన అప్లాటాక్సిన్ వృద్ధి చెందుతుంది. దీని
నివారణకు వండిన పసుపు ఆరబెట్టేటప్పుడు “పైకీ, కిందకు తిప్పాలి. ఉడికించేటప్పుడు తక్కువ, ఎక్కువ ఉడికించరాదు. ఎండా, గాలి తగిలే గట్టి కల్లంలో ఆరబెట్టాలి. పసుపును ఎండబెట్టేటప్పుడు వర్షంలోగాని, మంచులో గాని తడవకుండా టార్ఫాలిన్ పట్టా కప్పి ఉంచాలి.
READ ALSO : Turmeric Cultivation : వాతావరణ మార్పులతో పసుపుకు తెగుళ్ల బెడద.. నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు
పాలిషింగ్ ;
ఎండిన పసుపును మెరుగు పెడితే దుంపులు ఆకర్షణీయంగా తయారవుతాయి. పాలిషింగ్ చేయడానికి ఇప్పుడు (డ్రమ్ములు అందుబాటులో ఉన్నాయి. పసుపు దుంపలను, కొమ్ములను డ్రమ్ములో పోసి హ్యాండిల్‌తో త్రిప్పితే డ్రమ్ము తిరుగుతుంది. డ్రమ్ము పక్క భాగంలో ఇనుప మెష్ ఉండడం వలన ఒకదానికొకటి రాసుకుని పసుపు మెరుగు పెట్టబడుతుంది. ఆఖరి దశలో పసుపు పొడిని నీళ్ళలో కలివి కొమ్ములపై చిలకరించినట్లయితే అకర్షణీయంగా తయారవుతాయి. కృత్రిమ రంగులు వాడరాదు.