High Moisture Corn : మొక్కజొన్నలో తేమ వల్ల నష్టం జరగకుండా నివారిస్తే!

ఆరబెట్టిన మొక్కజొన్న గింజలను శుభ్రమైన గోనె సంచులు , పాలిథిన్ సంచులలో తక్కువ తేమ గల ప్రాంతాలలో నిల్వ చేయాలి.

High Moisture Corn : మొక్కజొన్నలో తేమ వల్ల నష్టం జరగకుండా నివారిస్తే!

Preventing moisture damage in corn!

Updated On : November 25, 2022 / 4:29 PM IST

High Moisture Corn : మొక్కజొన్న కోతలు, నూర్పిడిల తరువాత వచ్చిన గింజలలో తేమ ఉంటుంది. నిలువలలో బూజులు ఆశించకుండా ఉండేందుకు నూర్పిడి చేసిన మొక్కజొన్నలు 4 రోజులు ఎండబెట్టి తేమను తగ్గించుకోవాలి. ఆరబెట్టిన మొక్కజొన్న గింజలను శుభ్రమైన గోనె సంచులు , పాలిథిన్ సంచులలో తక్కువ తేమ గల ప్రాంతాలలో నిల్వ చేయాలి. నిల్వ చేసే సమయంలో ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు, తేమ వల్ల నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి.

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ;

రైతులు మొక్కజొన్నను ఆరబెట్టి, గ్రేడింగు చేసి తగిన నాణ్యత ప్రమాణాలతో మంచి ధరికి అమ్ముకోవచ్చు. మంచి ధరకు అమ్ముకోవాలంటే తేమ 14శాతం, నంగే మారిన గింజలు 4.5 శాతం కంటే తక్కువ, పాడైపోయిన గింజలు 1.5 శాతం కంటే తక్కువ, సైజు తక్కువ ఉన్న గింజలు 3శాతం కంటే తక్కువ ఉండాలి.

మొక్కజొన్న వ్యర్ధాల విషయంలో ;

రైతులు మొక్క జొన్న చొప్పను పొలంలో తగుల బెట్టే పద్దతిని పాటిస్తున్నారు. ఇలా చేయరాదు. ఎకరాకు 5టన్నుల వరకు మొక్కజొన్న చొప్ప వస్తుంది. ఈ చొప్పలో 35 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఉంటుంది. వీటితో పాటు అనేక ఉప సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న చొప్ప నేలతోొ కలిసేలా చేయడం వల్ల పోషకాలు తిరిగి నేలకు చేరి నేలలు సారం కోల్పోకుండా ఉంటాయి.

కండెలు కోసిన తరువాత పొలంలో మిగిలిన చొప్పను ట్రాక్టరు సహాయంతో నడిచే యంత్రంతో చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలు రోటోవేటరుతో నేలలో కలిసేలా రోటోవేటరు తో దున్నుకోవాలి. నేలలో కలిసి కుల్లిపోతే పోషక విలువల స్ధాయి పెరుగుతుంది. రైతులు మొక్కజొన్న చొప్పను తగుల బెట్టకుండా భూసారాన్ని రక్షించుకోవాలి.