Mixed Farming : లాభాలు పండించే.. మిశ్రమ వ్యవసాయం
Mixed Farming : ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు.

profitable mixed farming in telugu states
Mixed Farming : విశాఖ ఏజెన్సీ రైతుల ఆర్ధిక జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు పంటలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టే ఒక మోడల్ ఫాంను ఏర్పాటు చేశారు. సన్న, చిన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే ఈ మిశ్రమ సుస్థిర వ్యవసాయ పద్ధతుల పట్ల శిక్షణ ఇస్తు.. సాగుకు ప్రోత్సహిస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.
వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం. అంతే కాదు మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి.
అంతే కాక.. ఒకటి కాకపోయిన ఒక దాంట్లోనైనా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అందుకే విశాఖ జిల్లా, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మిశ్రమ సుస్థిర వ్యవసాయం పద్ధతులపై ఒక మోడల్ ఫాంను ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. ఏజెన్సీ రైతులకు ఈ సాగు విధానాలపట్ల శిక్షణ ఇచ్చి సాగుకు ప్రోత్సహిస్తున్నారు.
మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
Read Also : Kandi Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు