Cluster Beans : గోరు చిక్కుడు సాగులో యాజమాన్యపద్దతులు !

ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి.

Cluster Beans : గోరు చిక్కుడు సాగులో యాజమాన్యపద్దతులు !

Proprietary methods in the cultivation of Cluster Beans !

Updated On : December 26, 2022 / 5:18 PM IST

Cluster Beans : కూరగాయల పంటల సాగులో గోరు చిక్కుడు కూడా ఒకటి. ఈ పంట తీవ్ర కరువు పరిస్థితులను అధిక వేడిని తట్టుకొని, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలలో వాడుతారు.

గోరుచిక్కుడు సాగుకు అనువైన రకాలు ;

1. పూసా మౌసమి : ఖరీప్‌ పంటకు అనువైనది. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.

2.పూసాసదాబహార్‌ : ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటి కోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.

3. పూసానవబహార్ : దీని కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైన రకం.

వీటితోపాటుగా ప్రైవేట్‌ రకాలైన గౌరీ కూడా ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైదిగా ఉంటుంది. ఖరీఫ్‌ సీజన్ లో జూన్‌ నుండి జూలై వరకు వేసవిలో జనవరి రెండవ వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తు కోవచ్చు. విత్తన మోతాదు ఎకరాకు 12-16 కిలోలు సరిపోతుంది. విత్తేముందు కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ మరియు 4గ్రా. ట్రైకోడెర్మ విరిడి కలిపి విత్తనశుద్ధి చేయాలి. నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తేటట్లయితే రైజోబియం కల్చర్‌ విత్తనానికి పట్టించాలి.

ఎరువులు ; ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి. అంతరకృషిగా కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ మందును ఎకరాకు 1.25 లీ. లేదా అలాక్లోర్‌ 1.0 లీ. 1.25 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి.

నీటి యాజమాన్యం : గింజలు విత్తగానే నీరు పారించాలి. తరువాత 3 రోజులకు మళ్లీ నీరు అందించాలి. యివ్వాలి. ఆ తర్వాత ప్రతి 7-10 రోజులకు ఒకసారి నీటి తడులు యివ్వాలి.

సస్యరక్షణ: పేనుబంక : చిన్న, పెద్ద పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కల్గిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ లేదా ఫాసలోన్‌ లేదా ఫిప్రోనిల్‌ల లోని ఏదేని ఒక మందును 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మందును మారుస్తూ పిచికారీ చేయాలి.