Cultivation Of Crops : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు.. పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు
మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు.

Rains Alert
Cultivation Of Crops : తొలకరి వర్షం పలకరించింది. రెండు నెలలుగా ఎండల తాకిడికి ఎదుర్కొన్న నేల రెండు మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు పులకరించిపోతుంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన్నప్పటికీ ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు లేకపోవడంతో.. సీజన్ ఆరంభమై మూడు వారాలు దాటినప్పటికీ వానాకాలం సాగుకు రైతులు కాస్త వెనుకడుగు వేశారు. ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులకు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు.
READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట
తెలుగు రాష్ట్రాల్లో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నకుని సిద్ధంగా ఉంచుకున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరినార్లు పోసుకుని వర్షాలు కురిస్తే పొలాలు దున్నుకుని నాట్లు వేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్టంలోకి ప్రవేశించడంతో అన్న దాతలలో ఆశలు చిగురించాయి.
READ ALSO : Oppenheimer : శృంగార సన్నివేశంలో భగవద్గీత.. మండిపడుతున్న భారతీయులు.. తొలగించకపోతే ఊరుకోం
మూడు నాలుగు రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కారణంగా అంతటా మేఘాలు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. అదునైన వర్షం కురిస్తే అంతటా పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున విత్తుకునే అవకాశం ఉంది.