Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వరినాట్లు.. తొలిదశలో వచ్చే  చీడపీడలు, ఎరువుల యాజమాన్యం

Paddy Cultivation : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు.

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వరినాట్లు.. తొలిదశలో వచ్చే  చీడపీడలు, ఎరువుల యాజమాన్యం

Paddy Cultivation

Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు  పోసే పనులు ముమ్మరంగా  కొనసాగుతున్నాయి .  నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలామంది రైతులు నారుమడులను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

మరి కొంత మంది ఇప్పుడికే నాట్లు వేశారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , నారుమడిలో, ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్యం పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. లక్ష్మీ ప్రసన్న .

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు. కొంత మంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే, నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెదపద్ధతిలో వరిసాగు చేసుకోవచ్చు. అయితే నారుమడిలో నారు పుష్ఠిగా పెరిగి అందిరావాలంటే.. చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ.. ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. లక్ష్మీ ప్రసన్న.

Read Also : Paddy Management : కూరగాయ పంటల్లో నారుమడి పెంపకం