Seedling Cultivation Techniques : ప్రోట్రేలలో నారుపెంపకం.. సమయం, డబ్బు ఆదా అవుతుందంటున్న శాస్త్రవేత్తలు
Seedling Cultivation Techniques : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్ లలో ప్రోట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తుంది.

Seedling Cultivation Techniques
Seedling Cultivation Techniques : పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి, నాణ్యమైన నారు అందక, ఇటు పెట్టుబడి, అటు సమయం వృదా అవుతుంది.
READ ALSO : Lemon Farming : నిమ్మతోటల్లో రైతులు అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం !
మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. కానీ చాలామంది రైతులు సాధారణ పద్ధతిలోనే కూరగాయ నార్ల పెంపకం చేపడుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నారుమడులలో తెగుళ్ల తీవ్రత ఎక్కువై సరిపడా నారు అందిరాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్య నుండి గట్టెక్కేందుకు షేడ్ నెట్ లలో ప్రోట్రేలలో నారు పెంచే అధునాతన విధానం రైతులకు చేయూతనిస్తుంది. ప్రతి విత్తనాన్ని మెలకగా మార్చి ఆరోగ్యకరమైన నారు పొందేందుకు తోడ్పడుతోంది.
షేడ్ నెట్ లకింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ప్రస్థుతం షేడ్ నెట్ ల ఏర్పాటుకు ప్రభుత్వాలు 50 నుండి 75 శాతం రాయితీ అందిస్తుండటంతో రైతులకు పెట్టుబడి భారం తక్కు. నార్లు పెంచిన తర్వాత అధిక వ్యాపార విలువలు వున్న ఇతర పంటలను కూడా సాగుచేసుకోవచ్చు.
READ ALSO : Bark Mite : పండ్లతోటల్లో బెరడు తొలిచే పురుగు నివారణ
ప్రోట్రేలలో పెంచడం ద్వారా మట్టితో సంబంధం ఉండదు కాబట్టి చీడ పీడలు బెడద తక్కువ. మందుల వినియోగం కూడా పెద్దగా ఉండదు. అక్కడక్కడ ఆకుముడత, లద్దెపురుగు కనబడితే శాస్త్రవేత్తల సూచనల మేరకు రసాయన మందులను పిచికారి చేయాలి. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి శాస్త్రీయ పద్ధతిలో నారు పెంచి సాగు చేస్తే అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ప్రోట్రేలలో నారు పెంచే విధానం గురించి కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర ,శాస్త్రవేత్త డా. వేణుగోపాల్ ద్వారా తెలుసుకుందాం.