Short Duration Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక వరి రకాలు

తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక  వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

Short Duration Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక వరి రకాలు

Paddy Crop Cultivation Methods

Updated On : June 19, 2023 / 2:32 PM IST

Short Duration Rice Varieties : ఖరీఫ్ వరిసాగుకు  సమయం దగ్గర పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకుని, విత్తనాలు సమకూర్చుకునే  పనిలో వున్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా స్వల్ప, అతి స్వల్పకాలిక రకాలను సాగుచేయాలనుకునేవారు.. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు. వాటి గుణగణాలు తెలుసుకోవాలి. ఇప్పటికే  రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాను నమోదు చేస్తున్న ఖరీప్ కు అనువైన స్వల్పకాలిక వరి వంగడాలు, వాటి విశిష్ఠ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Kunaram Rice Varieties : ఖరీఫ్ కు అనువైన కూనారం పరిశోధనా స్థానం వరి రకాలు.. ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి :

వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్దకాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరిసాగులో నీటి కొరత ఓ వైపు, చీడపీడల సమస్య మరో వైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే…. పెరిగిన పెట్టుబడులు వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే కాని, సాగు గిట్టుబాటుకాని పరిస్థితి ఏర్పడింది.

READ ALSO : Coriander Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కొత్తిమీర సాగు.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు.  ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక  వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఖరీఫ్ లో  సన్నగింజతో పాటు లావు గింజ రకాలను సైతం పండింస్తుంటారు రైతులు. కానీ ఏరకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అంలాంటి వారికోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..