Carrot Farming : క్యారెట్ సాగుకు తేలికపాటి నేలలు అనుకూలం – నాణ్యమైన దిగుబడికి మెళకువలు

Carrot Farming : క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. వేరుకూరగాయగా చెబుతారు.  విటమిన్ ‘ఎ' అధికంగా వుండటం వల్ల, దీన్ని తినటంవల్ల  ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు. 

Carrot Farming : క్యారెట్ సాగుకు తేలికపాటి నేలలు అనుకూలం – నాణ్యమైన దిగుబడికి మెళకువలు

Techniques in Carrot Farming

Updated On : October 18, 2024 / 3:34 PM IST

Carrot Farming : శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంట  క్యారెట్. విటమిన్ ‘ఎ’ అధికంగా వుండి, ఆరోగ్యానికి మేలుచేసే ఎన్నో గుణాలు కలిగి వుండటంతో మార్కెట్ మంచి డిమాండ్ ఉంది.  దీంతొ రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. అయితే శీతాకాలంలో అందివచ్చే పంట నాణ్యతతోపాటు అధిక దిగుబడినిస్తుంది. ప్రస్తుతం ఈపంట సాగుకు అనుకూలమైన సమయం. మరి రకాల ఎంపికతో పాటు అధిక దిగుబడుల కోసం సాగు పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు  పశ్చిమగోదావరి జిల్లా, వెంటకరామన్నగూడెం ఉద్యాన కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె. ఉషా కుమారి ద్వారా తెలుసుకుందాం.

క్యారట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. దీన్ని వేరుకూరగాయగా చెబుతారు.  విటమిన్ ‘ఎ’ అధికంగా వుండటం వల్ల, దీన్ని తినటంవల్ల  ఆరోగ్యానికి ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు.  ఉష్ణోగ్రత 18-24 డిగ్రీల సెల్సియస్ మధ్య వున్నప్పుడు కారట్ పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. అంటే మన ప్రాంతంలో శీతాకాలం ఈ పంటసాగుకు అత్యంత అనుకూలం.

నవంబరు  వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. మార్కెట్ లో ఒడిదుడుకులుగా ఉన్న ధరను ధృష్టిలో ఉంచుకొని  , ఒకే సారి కాకుండా 15 రోజుల వ్యవధిలో దఫ దఫాలుగా విత్తుకుంటే సరాసరిన లాభాలు పొందే వీలుంటుంది. అయితే క్యారెట్ సాగుచేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంటకరామన్నగూడెం ఉద్యాన కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె. ఉషా కుమారి

పైరులో మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి వుంటాయి.  ఆఖరిదుక్కిలో పశువుల ఎరువుతోపాటు సగభాగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌లను వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజనిని విత్తిన 6వారాలకు పైపాటుగా లేదా డ్రిప్ వసతి వున్న రైతులు ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా, నేల స్వభావాన్ని బట్టి నీటితడులను అందించాలి.

క్యారట్ సాగులో ఆకుమచ్చ, ఆకుమాడు తెగులు, బూడిద తెగుళ్లు నష్టం ఎక్కువగా కన్పిస్తాయి. వీటితోపాటు ఆకుతినే పురుగులు, రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. వీటి నివారణకు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనిస్తూ,  సకాలంలో సస్యరక్షణా చర్యలను పాటించాలి. క్యారట్ విత్తిన 90 రోజులకు పంటకోతకొస్తుంది. పక్వానికొచ్చిన పంటలో ఆకులు పండుబారి, ఎండి రాలిపోతాయి. ఈ సమయంలో రైతులు దుంప పీకటం ద్వారా కాని, నాగలితో దున్నటం ద్వారా కాని దుంపలను వెలికితీయవచ్చు. తర్వాత వాటిని శుభ్రపరిచి మార్కెట్‌కు తరలించినట్లయితే అధిక ధర పొందే అవకాశం వుంది.

Read Also : Cashew Plantation : జీడితోటల్లో అంతర పంటలసాగు – తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం