Marigold Farming : మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్.. అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం 

Marigold Farming : మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో  మార్కెట్లో డిమాండ్ పెరిగింది.

Marigold Farming : మార్కెట్‌లో బంతికి మంచి డిమాండ్.. అధిక దిగుబడికి మేలైన యాజమాన్యం 

Techniques in Marigold Farming

Updated On : April 10, 2024 / 3:03 PM IST

Marigold Farming : పూలసాగులో  పేరెన్నికగన్న పూబంతి బంతి.. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ పూలకు మంచి డిమాండు ఉంటుంది. అంతే కాదు ఎక్కువ కాలం నిల్వ స్వభావం ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు.  అయితే సరైన ప్రణాళిక లేకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో  అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. బంతిపూల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులను ఏవిధంగా సాధించాలో తెలియజేస్తున్నారు  ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్.

Read Also : Green Gram Cultivation : పెసర, మినుము పంటల్లో చీడపీడల ఉధృతి 

పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో  మార్కెట్లో డిమాండ్ పెరిగింది. సంవత్సరం పొడవునా సాగుచేసే అవకాశం ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయితే రైతులు సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు.

బంతి పంటకాలం 120రోజులు. నాటిన 55రోజులనుంచి పూలదిగుబడి ప్రారంభమవుతుంది. ప్రస్థుతం చాలామంది రైతులు ఎకరాకు 20 నుండి 30 క్వింటాళ్ల పూల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే  ఎకరాకు 50 నుండి 100 క్వింటాల వరకు దిగుబడి సాధించవచ్చు . బంతిలో అధిక దిగుబడి కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి విద్యాసాగర్ .

బంతి మొక్కలకు అన్ని దశల్లోనూ సరిపడినంత తేమ భూమిలో ఉండాలి. నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి నీటి తడులివ్వాలి. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే ఎదుగుదల లేక పువ్వు దెబ్బతింటోంది. కాబట్టి డ్రిప్ ద్వారా నీటిని ఎరువులను అందిస్తే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు.

నాణ్యమైన పూల దిగుబడి సాధించాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం . మొక్కలు ఎదిగే కొద్ది ఎరువుల మోతాదును పెంచుతూ పోవాలి. ఎరువులతో పాటు సకాలంలో పోషకాల యాజమాన్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులను సాధించవచ్చు. బంతికి చీడపీడలు పెద్దగా ఆశించవు కేవలం పొగాకు లద్దెపురుగు, శనగపచ్చ పురుగులు మాత్రమే అధికంగా ఆశిస్తాయి. కాబట్టి సకాలంలో వీటి ఉనికిని గమనించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపగితే నాణ్యమైన పూలదిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది.

Read Also : Fertilizers Drip System : ఫర్టిగేషన్ ద్వారానే మొక్కలకు బలం.. డ్రిప్ ద్వారా ఎరువులు అందించడంలో మెళకువులు!