Vegetable Farming : వేస‌విలో కూర‌గాయ‌ల సాగులో మెళ‌కువ‌లు

Vegetable Farming : వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని సూచిస్తున్నారు,

Vegetable Farming : వేస‌విలో కూర‌గాయ‌ల సాగులో మెళ‌కువ‌లు

Vegetable Farming In Summer

Vegetable Farming : వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ , కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, రైతులు.. వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్దతులను చేపట్టాలని సూచిస్తున్నారు, కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

Read Also : Agriculture Tips : 4 ఎకరాల్లో 150 రకాల పండ్లతోట నిరంతరం ఆదాయం

వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు :
వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది.

కానీ వేసవిలో అదే కూరగాయలు సాగుచేస్తే, అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం వల్లే, ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.

ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను కూడా వాడినట్లైతే భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ