Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు

తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగుచేస్తున్నారు.

Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు

Paddy Varieties For Kharif Season

Paddy Varieties : ఖరీఫ్ సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో రైతులు ఆయాప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాతవాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు వున్నాయి.  సన్నగింజ, దొడ్డుగింజ వరి రకాల్లో వరంగల్ వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. అలాగే వీటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Short Duration Rice Varieties : ఖరీఫ్ కు అనువైన స్వల్పకాలిక వరి రకాలు

తెలంగాణలో బోర్లు, బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. చెరువులు, కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగుచేస్తున్నారు.

READ ALSO : High Yield Rice Crops : అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ వరి రకాలు

అయితే దీర్ఘకాలిక రకాలు సాగుచేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగుచేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారిగా, సాగుచేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.  ఈ దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాల గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త, డా. బి. సతీష్ చంద్ర .

READ ALSO : Kharif Rice Varieties : ఏపికి అనువైన ఖరీఫ్ వరి రకాలు

ఖరీఫ్ లో సన్నగింజ వరి వంగడాలతో పాటు కొంత మంది దొడ్డుగింజ రకాలను సైతం సాగుచేస్తూ ఉంటారు. అంతే కాదు ఈ మద్యకాలంలో వరి సాగులో పెట్టుబడులు తగ్గించుకునేందుకు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేస్తున్నారు రైతులు . మరోవైపు వర్షాలు ఆలస్యమైనా, దుక్కులు ఆలస్యంగా చేసుకునే ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. పూర్తి వివరాలకు దిగువ వీడియో లింక్ పై క్లిక్ చేయండి.