Yasangi Paddy Cultivation : యాసంగి వరికి తెగుళ్లు ఆశించే అవకాశం – ముందస్తు సమగ్ర సస్యరక్షణ చర్యలు 

Yasangi Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో యాసంగి వరిసాగుకు సిద్ధమవుతున్నారు. విత్తన సేకరణ నారుమడులు పోస్తున్నారు.

Yasangi Paddy Cultivation : యాసంగి వరికి తెగుళ్లు ఆశించే అవకాశం – ముందస్తు సమగ్ర సస్యరక్షణ చర్యలు 

Yasangi Paddy Cultivation

Updated On : January 9, 2025 / 2:40 PM IST

Yasangi Paddy Cultivation : నీటివసతి కింద, యాసంగి వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నార్లు పోసుకున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఈకాలంలో తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. నాణ్యమైన దిగుబడులను పొందాలంటే వరికి ఆశించే శీలీంధ్రపు నాశిని తెగుళ్లను విత్తన శుద్ధిద్వారా తొలిదశలోనే అరికట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో యాసంగి వరిసాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తన సేకరణ చేసుకున్న రైతులు నారుమడులు పోస్తున్నారు. అయితే ప్రతిఏటా శిలీంధ్రపునాశిని తెగుళ్లు వరి పంటకు తీవ్రఆటంకం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు రైతులు అధికమొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

తొలిదశలోనే అతితక్కువ ఖర్చుతో విత్తనశుద్ధి ద్వారా వీటిని అరికట్టవచ్చు. మరి యాసంగి వరిసాగుచేసూ రైతులు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు  కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి.

Read Also : Ragi Rice Varieties : అధిక దిగుబడినిచ్చే రాగి రకాలు సాగు మెళకువలు