Donkey Farm : గాడిదల ఫాం తో లక్షల్లో అదాయం పొందుతున్న యువరైతు !

గాడిద పాలల్లో అధిక పోషకాలు ఉండటంతో కాస్మోటిక్స్, పార్మ, ఆయుర్వేదంలోకి వాడేందుకు ఉపయోగపడుతున్నాయి. దీంతో కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

Donkey Farm : గాడిదల ఫాం తో లక్షల్లో అదాయం పొందుతున్న యువరైతు !

Young woman earning lakhs with donkey farm!

Updated On : March 4, 2023 / 3:14 PM IST

Donkey Farm : పనిపాట లేని వారిని గాడిదలు కాస్తున్నావా అంటూ సంబోధిస్తుంటారు. కాని అలాంటి గాడిదలను కాసే రోజే వస్తే.. అధికూడా లక్షల్లో ఆదాయం ఉంటే, ఎవరు ఏమనుకుంటే మనకేంటీ డబ్బులు వస్తున్నాయిగా అనుకుంటారు. అవును ఇప్పుడు గాడిదలు కాస్తూ లక్షలు సంపాదించే రోజులొచ్చాయి. గాడిదల పెంపకం ప్రస్తుతం లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఇందుకు నిదర్శనమే నాగర్ కర్నూలు జిల్లా బిజేపల్లి మండలానికి చెందిన యువరైతు అఖిల్.

ఒకప్పుడు గాడిదలు కాయడం కులవృత్తిగా ఉండేది సంచార జాతులు వీటిని సాకుతూ, వాటి ద్వారా వచ్చే పాలను అమ్ముతూ జీవనం సాగించేవారు. కొందరైతే బరువులు మోసేందుకు వాటిపి గాడిదలను ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం గాడిద పాలకు మంచి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కరోన సమయంలో వీటి ధరకు రెక్కలొచ్చాయి.

READ ALSO : Guinea Fowl Farming : గ్రామీణ రైతులకు అదనపు అదాయాన్ని అందించే గినీ కోళ్ళ పెంపకం!

అదే సమయంలో గాడిద పాలల్లో అధిక పోషకాలు ఉండటంతో కాస్మోటిక్స్, పార్మ, ఆయుర్వేదంలోకి వాడేందుకు ఉపయోగపడుతున్నాయి. దీంతో కంపెనీలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ డిమాండ్ నే దృష్టిలో ఉంచుకొని కొంత మంది యువరైతులు గాడిదల పెంపకం చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ చేపట్టి సక్సెస్ అయ్యారు.

ఈ కోవలోనే నాగర్ కర్నూలు జిల్లా, బిజేపల్లి మండలానికి చెందిన యువరైతు అఖిల్ శివశక్తి ఫామ్స్ పేరుతో 18 ఎకరాల్లో గాడిదల ఫాం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 15 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన పాలకు లీటరుకు రూ. 1600 చొప్పున కంపెనీలకు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.

ఈ రైతు ఏర్పాటు చేసిన ఫాం చుట్టుప్రక్కల యువరైతులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మార్కెటింగ్ సమస్య లేకపోవడం.. శ్రమ కూడా తక్కువగా ఉండటంతో.. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు గాడిదల పెంపకానికి మొగ్గుచూపుతున్నారు.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

ప్రస్తుతం ఆవులు, గేదెలు ఇతర పశువులతో పోటీ పడుతూ, గాడిద ధర కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కో గాడిద ధర మార్కెట్‌లో రూ.40 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. ఈ రైతు దగ్గర మొత్తం 69 గాడిదలుండగా అందులో ప్రస్తుతం పాలిచ్చే గాడిదలు 18 ఉన్నాయి. మరో 35 గాడిదలు చూడికట్టాయి. మిగతావి ఒట్టిపోయాయి.

రోజుకు 15 లీటర్ల పాలదిగుబడి వస్తుందని అఖిల్ చెబుతున్నారు. వచ్చిన పాలను తమిళనాడుకు చెందిన కాస్మోటిక్ కంపెనీకి ఒప్పందంపై లీటరుకు 1600 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. భవిష్యత్తులో మరిన్ని గాడిదలను కొనుగోలు చేసి, పాల ఉత్పత్తిని పెంచుతామంటున్నారు.