Guinea Fowl Farming : గ్రామీణ రైతులకు అదనపు అదాయాన్ని అందించే గినీ కోళ్ళ పెంపకం!

ఇంటెన్సివ్‌ పద్ధతిలో పెంచినప్పుడు వీటి దాణాలో 24-26 శాతం మాంనకృత్తులు, 2700 కి. కాలరీల ఎనర్జీ ఉండే విధంగా చూసుకోవాలి. గుడ్లు పెట్టే దశలో లేయర్‌ దాణా వాడాలి. అందులో కాల్షియం , ఫాస్పరస్‌ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి.

Guinea Fowl Farming : గ్రామీణ రైతులకు అదనపు అదాయాన్ని అందించే గినీ కోళ్ళ పెంపకం!

Guinea Fowl Farming :

Guinea Fowl Farming : గినీ కోడి మాంసం నాడుకోడి మాంసం తో సరిసమానమైన రుచిని కలిగి ఉండటంతో ప్రస్తుతం గినీ కోళ్లకు మార్కెట్లో మంచి గిరీకీ ఉంది. గినీ కోడి తల, మెడ శరీరాకృతి పొట్టిగా ఉండి నలుపు రంగు ఈకలపై తెల్లని మచ్చలు ఉంటాయి. ఇవి బాగా పరిగెత్తగలవు. చాలా చురుకుగా ఉండి చిన్న అలికిడి అయినా వెంటనే స్పందిస్తాయి. ఇంటి చుట్టుపక్కల ఉన్న పాములను గుర్తించి చంపుతాయి. ఈ కారణంగానే తోటలు, ఇంటి పరినరి ప్రాంతాల్లో క్రిమికీటకాలను నివారించుకోవడానికి ఈ కోళ్ళను. ప్రత్యేకంగా పెంచుతారు. సీమకోళ్ళలో పెర్ల్‌, వైట్‌, లావెండర్‌ అనే మూడుజాతులున్నాయి. ఈ మూడు జాతుల్లో పెర్ల్‌ జాతికి మంచి గుర్తింపు ఉంది. వీటి ఈకలు ఆభరణాల తయారీలో వాడతారు. వీటి మాంసం కోడి మాంసం కంటే కొంచెం ముదురు రంగులో ఉంటుంది. అంతేగాక వీటి మాంసం వాననను, రుచిని కలిగి ఉంటుంది.

ఇండియాలో కోళ్ళు, బాతుల తరువాత గినీ కోళ్ళు మూడవస్థానంలో ఉన్నాయి. దేశంలో నిరుపేద వర్గాలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం. గినీ కోళ్ళు సాంప్రదాయ పద్ధతిలో పెంచడానికి అనువుగా ఉండి, గ్రామీణప్రాంతవాసులు వీటిని ఆరుబటపద్దతిలో , ఇంటెన్సివ్ పద్దతిలో పెంచుకోవచ్చు. నాలుగు వారాల వయసు వరకు గినీ పిల్లలను ఎంచుకోవాలి. బ్రూడింగ్‌ సమయంలో పిల్లలకు 37 సెం. ఉష్ణోగ్రత కల్పించాలి. 14 వారాల వయసు వచ్చే వరకు గినీ కోళ్ళను, బ్రాయిలర్‌ కోళ్ళను పెంచినట్లుగా పెంచవచ్చు. ఒక్కో కోడికి 2-3 చదరపు అడుగుల స్థలం కావాలి. 14 వారాల తరువాత వాటిని ఆరు బయట పెంచుకోవచ్చు. బ్రాయిలర్‌ దాణాను కూడా వీటికి ఉవయోగించవచ్చు. అంతేగాక ఇంట్లో ఉండే నూకలు, ధాన్యం గింజలు, వంట గది వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారపదార్థాలు, ఆరుబయట దొరికే క్రిమికీటకాలను తిని ఇవి బతకగలవు.

ఇంటెన్సివ్‌ పద్ధతిలో పెంచినప్పుడు వీటి దాణాలో 24-26 శాతం మాంనకృత్తులు, 2700 కి. కాలరీల ఎనర్జీ ఉండే విధంగా చూసుకోవాలి. గుడ్లు పెట్టే దశలో లేయర్‌ దాణా వాడాలి. అందులో కాల్షియం , ఫాస్పరస్‌ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. గినీ కోళ్ళు కొన్ని కాలాల్లో మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. ఎక్కువగా వేసవికాలంలో గుద్గు పెడతాయి. మగ, ఆడ పక్షుల నిష్పత్తి 1: 4 ఉండేలా చూసుకోవాలి. ఇవి దాదాపు 9 నెలల వయసులో గుడ్డు పెట్టడం మొదలుపెడతాయి. ఒక్కోటి 60-100 గుడ్డు పెడతాయి. సంవత్సరం దాటిన తరువాత గుడ్ల ఉత్పత్తి అంత లాభదాయకంగా ఉండదు. కోళ్ళ కంటే వీటి గుడ్లు చిన్నగా ఉండి పసుపు లేత గోధుమ రంగులో ఉంటాయి. గుడ్లలో 13.5 శాతం ప్రొటీన్స్‌ ఉంటాయి. ఈ గుడ్లను పొదుగుడు కోడి ద్వారా గాని, ఇంక్యుటేటర్‌ ద్వారా గాని పొదిగించవచ్చు.

12 వారాల వయను దాటిన తరువాత మందంగా పెరిగే జుట్టు ద్వారా మగ కోళ్ళను గుర్తించవచ్చు. ఈ జుట్టు నీలి ఛాయలున్న ఎరుపు రంగులో ఉంటుంది. తల మీద పింఛం కంచెం పెద్దదిగా ఉంటుంది. అడకోళ్ళలో జుట్టు చిన్నగా ఉండి, ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఏ వయసులోనైనా ఆడ, మగ కోళ్ళను ఖచ్చితంగా గుర్తించడానికి ప్రత్యుత్పత్తి ఒక్కటే మార్గం. మగ గినీ కోళ్ళు, కోళ్ళకు వచ్చే వ్యాధులను తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. పైగా వీటికి టీకాలు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొక్కెర వ్యాధి టీకాలు వేయిస్తే మంచిది.

లాభదాయకంగా ;

మామూలు కోళ్ళకంటే మేలు రకం గినీ కోళ్ళు నెమ్మదిగా పెరుగుతాయి. 12 వారాల వయనులో 1-2 కిలోల బరువు అవుతాయి. వీటి మాంనం రుచికరంగా, కోడిమాంనంలాగా ఉంటుంది. కౌలస్ర్రాల్‌ తక్కువ ఉండడం కూడా ఉపయోగపడే విషయమే. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో గినీ కోళ్ళను విజయవంతంగా పెంచవచ్చు. కాబట్టి దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ. వీటిని పెంచవచ్చు. సరైన లాభాలకు సమర్థవంతమైన పద్ధతులు పాటించి, మంచి మార్కెట్‌ చూనుకొని పెంచితే ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏదాడికి ఇవి 100 గుడ్ల వరకు పెడతాయి. గుడ్డు బరువు 45 గ్రాముల వరకు ఉంటుంది. 18 వారాల సమయంలో విక్రయానికి వినియోగించవచ్చు.