3 రాజధానుల రగడ : మోడీ శంకుస్థాపన చేసి చోట బీజేపీ చీఫ్ మౌన దీక్ష

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 01:43 AM IST
3 రాజధానుల రగడ : మోడీ శంకుస్థాపన చేసి చోట బీజేపీ చీఫ్ మౌన దీక్ష

Updated On : December 27, 2019 / 1:43 AM IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోడీ.. రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు.

రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా విమర్శించారు. జగన్‌కు అనుభవరాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు. సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడేలా చేస్తోందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. ఏపీకి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించే ఛాన్స్ ఉందన్న సీఎం జగన్.. నగరాభివృద్ధికి భారీ వరాలు ప్రకటించారు. విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా 7 జీవోలను జారీ చేసింది. విశాఖకు రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 జీవోల ద్వారా రూ.394 కోట్ల 50 లక్షలు.. అభివృద్ధి పనులకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

కాపులుప్పాడ సమీపంలో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం 22.5 కోట్లు.. కైలాసగిరి ప్లానిటోరియం కోసం 37 కోట్లు మంజూరు చేశారు. సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవెల్ కార్‌ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం 80 కోట్లు.. నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం రీసెర్చ్‌ సంస్థ కోసం 88 కోట్లు కేటాయించారు. నాతయ్యపాలెం జంక్షన్‌ సమీపంలోని చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం 90 కోట్లు.. సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌, బీచ్‌రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం 40 కోట్లు.. ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్‌ నిర్మాణం కోసం 75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.