శానిటైజర్ తాగి 10మంది మృతి : ఏపీలో మత్తు కోసం చిత్తవుతున్న ప్రాణాలు

  • Published By: nagamani ,Published On : July 31, 2020 / 12:52 PM IST
శానిటైజర్ తాగి 10మంది మృతి : ఏపీలో మత్తు కోసం చిత్తవుతున్న ప్రాణాలు

Updated On : October 31, 2020 / 4:36 PM IST

ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగిపోవటంతో..కొంతమంది మందుబాబులు కిక్కుకోసం శానిటైజర్లు తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శానిటైజ్ తాగి 10తాగి చనిపోవడం తీవ్ర కలకలంరేపింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర మద్యానికి బానిసై శానిటైజర్ లో నీళ్ళు కలుపుకుని తాగినవారిలో ఇప్పటి వరకూ 10మంది చనిపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగాపెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఘటనలో బాధితులు ఇంకెంతమంది ఉన్నారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశామని..స్థానికంగా శానిజైట్ అమ్మే షాపుల్లో అమ్ముతున్న శానిటైజర్ బాటిల్స్ ను సీజ్ చేసి వాటిని ల్యాబ్ కు తరలించిపరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు.



కాగా వీరు శానిటైజర్ తాగి మృతి చెందారా? లేక కల్తీ మద్యం తాగి మరణించారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. గురువారంజరిగిన ఈ ఘటనలో నిన్న ముగ్గురు చనిపోగా..ఈరోజు మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు స్థానికులు..ముగ్గురు యాచకులు ఉన్నారని పోలీసులు గుర్తించారు.



రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంతో.. కొంతమంది మద్యం కొనుక్కునే స్తోమత లేక శానిటైజర్లలో నీటిని కలుకుపుకుని తాగుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే అతడ్ని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. అదే ప్రాంతంలో మరొకరు చనిపోగా..ఈరోజు మరో ఏడుగురు చనిపోవటంతో పోలీసులు రంగంలోకి దిగారు.



కురిచేడులోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఉండే రమణయ్య అనే వ్యక్తి గురువారం ఉదయం శానిటైజర్‌ లో ఏదో కలుపుకుని తాగుతుండగా స్థానికులు గుర్తించి వారించారు. కానీ అప్పటికే తాగేశాడు.. తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. అతడు కూడా అపస్మారక స్థితిలో పడిపోగా.. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అతడ్ని దర్శి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా మరో ఏడుగురు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. వారు కూడా శానిటైజర్ తాగారని స్థానికులు చెబుతున్నారు.. వీరంతా శానిటైజర్ తాగారా.. నాటుసారా తాగి అస్వస్థతకు గురయ్యారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మృతుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు.