బెంజ్ రోడ్డులో 1060…108, 104 కొత్త వెహికల్స్ ప్రారంభం – సీఎం జగన్

108, 104 వాహనాలకు ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయోనన్న అధ్వాన్న పరిస్థితి నుంచి బయటపడ్డామని సీఎం జగన్ వెల్లడించారు. దాదాపు 1060 కొత్త వెహికల్స్ (108, 104) ప్రయాణం చేసి ప్రతి జిల్లాకు చేరుకుంటాయన్నారు. బెంజ్ సర్కిల్ రోడ్డుపై జెండా ఊపి ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2020, మే 29వ తేదీ శుక్రవారం వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్..మాట్లాడుతూ…
ప్రతి ఊరు రూపు రేఖలను మారుస్తామని, గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్లతో పాటు..YSR విలేజ్ క్లినిక్ తీసుకొస్తున్నామన్నారు. అక్కడే ANM 24 గంటల పాటు ఉంటుందని, ఆశా వర్కర్లు వచ్చి రిపోర్టు చేస్తారన్నారు. 54 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, పెద్ద పరిస్థితి వస్తే..ఆరోగ్య శ్రీ కి అక్కడే రిఫరెన్స్ పాయింట్ చేస్తారన్నారు. 20 నిమిషాల్లోనే 108, 104 వాహనాలు వస్తాయని, 13 వేలకు పైగా..విలేజ్, వార్డు క్లినిక్ లు తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 2021, మార్చి వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
రూ. 2600 కోట్లు ఇందుకు కేటాయించడం జరిగిందన్నారు. ఉన్న పీహెచ్ సీ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం జరుగుతోందని, 1138 పీహెచ్ సీలను ఉన్న వాటిని అభివృద్ధి మారుస్తున్నామని, రూ. 671 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని, ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయన్నారు. 52 ఏరియా ఆసుపత్రులను పూర్తిగా మారుస్తున్నట్లు, వీటికి టెండర్లు పిలుస్తామన్నారు.
Read: వేయి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు : జులై 8న మరో 6 జిల్లాల్లో వర్తింపు – సీఎం జగన్