10th exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత
కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్‌తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు.

Ssc Exams
10th class exams : ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల 45నిమిషాలకు ముగుస్తాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాలకే విద్యార్థినులు అందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. 9 గంటల 30 నిమిషాల తరువాత ఏ విద్యార్థినీ పరీక్షా కేంద్రంలోనికి అనుమతించమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్‌తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. ఆ తర్వాత కోవిడ్‌తో విద్యాసంవత్సరం సరిగా సాగలేదు. ఇక 2021లోనూ సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 7 పేపర్లు మాత్రమే రాయనున్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,22,537 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుల్లో 3,20,063 మంది విద్యార్థులు, 3,02,474 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,776 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 292 సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు.
ఒక ఎగ్జామ్ హాల్ లో 16 మంది విద్యార్థులు పరీక్షలు రాసే ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్ఎం ల నియామకం, మంచినీటి సదుపాయం కల్పించారు. పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతో ట్రెజరీ, రెవిన్యూ, పోలీస్, పోస్టల్, ఏపిఎస్ ఆర్టీసీ, ట్రాన్స్ కో, వైద్య ఆరోగ్యశాఖ, తదితర విభాగాలను ప్రభుత్వం సమన్వయం చేసింది. పరీక్షా పత్రం లీకేజ్ అంటూ పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లోనికి ఛీఫ్ సూపరిండెంట్లు తప్ప ఇతరులు ఎవ్వరూ సెల్ ఫోన్ తీసుకవెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ల్యాబ్ టాప్ లు, ఇతర డిజిటల్ పరికరరాల కూడా అనుమతించకూడదని ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వ్యహారాలు చక్కబడనుందున 13 జిల్లాల డీఈవోలనే కొత్త జిల్లాలలో పరీక్షల నిర్వహణకు నోడల్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఈ సారి తొలిసారిగా 24 పేజీల బెక్ లెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పార్టు – 1 లోని ఓఎమ్మార్ షీట్ లో పేర్కొన్న వివరాలను హాల్ టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. బుక్ లెట్ లో విద్యార్థులు రోల్ నెంబర్ ను, తమ పేరును, స్కూల్ పేరును రాయకూడదు. అలాగే గ్రాఫ్ లో, మ్యాప్ పాయింట్ లో కూడా రోల్ నెంబర్ రాయకూడదు. ఎవరైనా పొరపాటున రాస్తే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డవారుగా పరిగణించబడతారు.