AP 10th Exams Schedule: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

AP 10th Exams Schedule: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

AP 10Th Exams

Updated On : December 30, 2022 / 3:07 PM IST

AP 10th Exams Schedule: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ మొదటి వారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం పరీక్షల తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆరు సబ్జెక్టులకే పరీక్షల నిర్వహణ ఉంటుందని టెన్త్ బోర్డు ప్రకటించింది. దీంతో సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు.

షెడ్యూల్ ఇలా..

ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8న ఇంగ్లీష్
ఏప్రిల్ 10న మ్యాథ్స్
ఏప్రిల్ 13న సైన్స్
ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18న ఒకేషనల్ కోర్సు