బాషా సినిమాలో రజనీకాంత్‌లా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటో డ్రైవర్ డ్రెస్.. ఫొటోలు వైరల్
పట్టణంలోని జేసీ నివాసం వద్ద నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.

JC Prabhakar Reddy: అనంతపురంలోని తాడిపత్రిలో మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ జరిగింది. ఇందులో జేసీ ప్రభాకర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్ గెటప్‌లో నానో కారు నడిపారు.
పట్టణంలోని జేసీ నివాసం వద్ద నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. బాషా సినిమాలో రజనీకాంత్‌లా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆటో డ్రైవర్ డ్రెస్ వేయడంతో ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

JC Prabhakar Reddy

JC Prabhakar Reddy
Also Read: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ నెల 8 వరకు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
కాగా, ఇవాళ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత సభలు నిర్వహించి 15,000 వేల రూపాయలను ఆటో డ్రైవర్ల ఖాతాలలో జమ చేసింది కూటమి ప్రభుత్వం.
ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆదుకుంటోంది. పలు ప్రాంతాల్లో నారా చంద్రబాబు నాయుడి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వంలోని నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ సంఘాల నాయకులు, డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.