Food Poison : పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్ధత
శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు.

Tekkali Government Hospital
Food Poison : శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలో పుట్టగొడుగులు లభించడంతో స్థానికులు వాటిని వండుకుని తిన్నారు.
సోమవారం రాత్రి 10 గంటలు తర్వాత పుట్ట గొడుగులు కూర తిన్న వారంతా వాంతులు కావటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన 18 మందిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
Also Read : Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత గుండెనొప్పులు పెరుగుతున్నాయట