Corona Cases : ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు, ఇద్దరు మృతి
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Ap Corona
new corona cases in AP : ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కృష్ణా జిల్లాలో 34, శ్రీకాకుళం జిల్లాలో 22 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 14,455 మంది మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
Chandrasekhar Reddy : ‘పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంది’
ఏపీలో 24 గంటల వ్యవధిలో 30,4747 పరీక్షలు నిర్వహించారు. ఒక్కరోజులో 204 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,57,573 మంది బాధితులు కోలుకున్నారు.