Chandrasekhar Reddy : ‘పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉంది’
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విభజన తర్వాత నుంచి ఏపీ వివిధ రకాలుగా ఇబ్బందుల్లో ఉందన్నారు.

Chandrashekhar Reddy
AP government positive about the PRC : పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విభజన తర్వాత నుంచి ఏపీ వివిధ రకాలుగా ఇబ్బందుల్లో ఉందన్నారు. కరోనాతో ఏపీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పీఆర్సీని వారం రోజుల్లో ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.. ఆ కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.
పీఆర్సీపై సీఎం ప్రకటన చేశారు కాబట్టి.. ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉందనే విషయాన్ని ఉద్యోగులు గమనించాలని చెప్పారు. అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఐఆర్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు.
Ravikumar Comments : ఏపీ జేఏసీ నేతలపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం నేత రవికుమార్ సంచలన వాఖ్యలు
ఆర్టీసీ విలీనం, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి.. లక్షా 30 వేల మందికి ఉద్యోగాలిచ్చారని వెల్లడించారు. పెండింగ్ డీఏలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత డీఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కూడా ప్రభుత్వం వర్క్ అవుట్ చేస్తోందని చెప్పారు. దీనిపై సీఎం త్వరలో ఓ విధానం తీసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఓ క్రమ పద్ధతిలో చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి జరగని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా జరిపామని పేర్కొన్నారు. సీఎం.. ఉద్యోగుల పెద్ద దిక్కు.. కోపం వచ్చినప్పుడు ఏదో కామెంట్ చేసి ఉన్నారు.. మంచి జరిగితే పాలాభిషేకాలు చేశారని తెలిపారు.
బండి శ్రీనివాస్ వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూలగోడతామని బండి శ్రీనివాస్ వ్యాఖ్యానించి ఉండరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. గత రెండు పీఆర్సీల్లో ప్రకటన తర్వాతనే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేశారని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘ నేతల మీద చాలా ఒత్తిడి ఉందని తెలిపారు.