ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఒకేసారి 6 పాలసీలు- సీఎం చంద్రబాబు
ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్ మెంట్ వచ్చింది అని అడిగే వాళ్లు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది చూస్తున్నాం.

Ap New Policies : మంత్రివర్గ సమావేశంలో 6 కొత్త పాలసీలను ఆమోదించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకేసారి ఆరు పాలసీలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని రూపొందించినట్లు వివరించారు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు. యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలనేది తమ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
”క్యాబినెట్ భేటీలో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీలు కూడా గేమ్ ఛేంజర్ గా తయారవుతాయి. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంట్రపెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఇంకా కొన్ని పాలసీలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది. అవి తొందరలోనే వస్తాయి.
టూరిజం పాలసీ, ఐటీ, వర్చువల్ వర్కింగ్ పాలసీ.. ఇవి కూడా తీసుకొస్తాం. ఒకేసారి ఆరు పాలసీలు తీసుకొచ్చాం. ఇందుకోసం చాలా కసరత్తు చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఎన్నికల్లో స్పష్టంగా చెప్పాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందుకే జాబ్ ఫస్ట్. ఏ పాలసీలో అయినా ఉద్యోగాలకు ప్రాధానత్య ఇచ్చాం.
ఇంతకుముందు ఎంత ఇన్వెస్ట్ మెంట్ వచ్చింది అని అడిగే వాళ్లు. ఇప్పుడు మేము చేసే పాలసీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది చూస్తున్నాం. చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం, ఉపాధి కోసం ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. మేము తీసుకొచ్చే పాలసీలు ఏపీలో ఉండే యువత.. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.
”మనం తీసుకున్న ఈ 6 పాలసీలు రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తులో పెను మార్పు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రగతినే మారుస్తుంది. పారిశ్రామికవేత్తలు మన దగ్గర తిరగడం కాదు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి. అమరావతిలో మెయిన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉత్తరాంధ్రకు విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరికి- రాజమండ్రి.. కృష్ణా గుంటూరుకి- విజయవాడ లేదా గుంటూరు.. ప్రకాశం నెల్లూరు చిత్తూరుకి- తిరుపతి.. కడప, అనంతపురం, కర్నూలుకి- అనంతపురం.. 5 జోన్లకి 5 ఇన్నోవేషన్ హబ్స్ వస్తాయి. ఇవన్నీ రతన్ టాటా పేరుతోనే ఉంటాయి. అది చూసినప్పుడు స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి” అని సీఎం చంద్రబాబు తెలిపారు.