Mother Killed Child With Boyfriend : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి బిడ్డను హత్య చేసి పూడ్చిపెట్టిన తల్లి

కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.

Mother Killed Child With Boyfriend : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి బిడ్డను హత్య చేసి పూడ్చిపెట్టిన తల్లి

boy killed

Updated On : December 30, 2022 / 1:40 PM IST

Mother Killed Child With Boyfriend : కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. తూప్రాన్ పేటలో నాలుగేళ్ల బాలుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. మారుతినాయుడు, కవిత భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్లుగా బాలుడు ఉన్నాడు. అయితే కవిత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో బాలుడు కనిపించకపోవడంతో అతడి తండ్రి మారుతినాయుడు పోలీసులను ఆశ్రయించాడు. బాలుడు మిస్సింగ్ విషయంలో భార్య కవితపై మారుతినాయుడు అనుమానం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం ఏర్పరచుకుని బిడ్డను చంపేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారించిన పోలీసులు బిడ్డను చంపి పెరట్లోనే పాతి పెట్టిందని గుర్తించారు. మరోవైపు భర్త ఆరోపణలను భార్య కవిత ఖండించారు.

Janagaon : కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

బిడ్డ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని తల్లి కవిత అంటున్నారు. కొద్ది రోజుల క్రితం రాత్రి 10.30 గంటల సమయంలో నిద్ర లేచి చూసే సరికి బిడ్డ చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. తన ప్రియుడే బిడ్డను చంపేశాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటల సమయంలో ప్రియుడే బిడ్డను పూడ్చి పెట్టాడని కవిత చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.