Earthquake In AP : ఏపీలో స్వల్ప భూకంపం..నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రకంపనలు
ఏపీలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయగిరి, కొండాపురం, వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.

slight earthquake In AP
Earthquake In AP : ఏపీలో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నెల్లూరు జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయగిరి, కొండాపురం, వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.
రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. గత నెలలో కూడా ఇదే ప్రాంతాల్లో భూమి కంపంచింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
Earthquake : నేపాల్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత
ప్రకాశం జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. పామూరు మండలం రామగోపాలపురం, బోట్లగూడూరు, పామూరు టౌన్ లో భూ ప్రకంపనలు సంభించాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆరుబయట ఉండాలని అధికారులు సూచించారు. భవంతులు, భారీ చెట్ల దగ్గర ఉండవద్దని పేర్కొన్నారు.